అతి త్వరలో వాట్సాప్ యూజర్లకు అద్భుతమైన ఫీచర్ అందుబాటులో రాబోతుంది. ఈ ఫీచర్ ప్రకారం ఇకపై మీరు పంపిన మెసేజ్ ఆటో డిలీట్ అవుతుంది. సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే అది డిలీట్ చేసేవరకు అలానే కనిపిస్తుంది.
రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మీరు పంపిన మెసేజ్ దానికి అదే 15 నిమిషాల్లో ఆటో డిలీట్ అయిపోతుంది. మెసేజ్ విషయంలో ఎక్కువగా ప్రైవసీ కోరుకునే యూజర్లకు బెస్ట్ ఫీచర్. వాట్సాప్ ఈ ఆటో డిలీట్ ఫీచర్ అతి త్వరలో రాబోతుంది. ప్రస్తుతానికి వాట్సాప్ ఈ ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది.
వాట్సాప్ ‘ఆఫ్టర్ రీడింగ్’ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ మెసేజ్ చదివిన వెంటనే చాట్ నుంచి వెంటనే మాయమైపోతుంది. ఈ ఫీచర్‌కు ‘ఆఫ్టర్ రీడింగ్’ అని పేరు పెట్టారు. ఎవరైనా మెసేజ్‌చదివిన వెంటనే ఆటో డిలీట్ చేయొచ్చు.
ప్రస్తుతం వాట్సాప్ (24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులలో మెసేజ్ అదృశ్యమయ్యేలా ఆప్షన్ అందిస్తోంది. అంతకన్నా బెటర్ ప్రైవసీని అందించే ఫీచర్ ఇప్పుడు తీసుకురానుంది. ఈ కొత్త అప్‌డేట్ ద్వారా OTP లేదా వ్యక్తిగత సమాచారం వంటి ప్రైవసీపరమైన టెక్స్ట్‌లను ఎవరైనా చూసిన వెంటనే డిలీట్ అయ్యేలా చేయొచ్చు.
మీరు మెసేజ్‌లను చదివిన 15 నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ యూజర్ మెసేజ్ ఓపెన్ చేయకపోతే చదవని మెసేజ్ 24 గంటల్లో ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. మీరు రీడ్ రిసీప్ట్‌లను (బ్లూ టిక్స్) ఆఫ్ చేసినప్పటికీ కూడా చాట్‌లకు వర్తిస్తుంది.
మీరు ఎవరికైనా టెంపరరీగా ఏదైనా మెసేజ్ పంపాలంటే ఈ వాట్సాప్ ఫీచర్ బెస్ట్. ఎవరి చాట్ అయినా మెసేజ్ అవసరం లేదంటే వెంటనే డిలీట్ చేయొచ్చు. ఎవరికైనా పాస్‌వర్డ్ లేదా OTP పంపాలా? ఈ కొత్త ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. చూసిన వెంటనే ఆ మెసేజ్ డిలీట్ అయిపోతుంది.
వాట్సాప్ అన్ని చాట్స్‌కు వర్తిస్తుంది
మీరు పంపే ఫొటో లేదా వీడియో ఏదైనా వాట్సాప్ వ్యూ వన్స్ ఫీచర్ ద్వారా వర్క్ అవుతుంది. సాధారణ టెక్స్ట్ మెసేజ్‌ల కోసం కూడా వాడొచ్చు. ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా వెర్షన్‌లో బీటా టెస్టర్లు ఈ ఫీచర్‌ను గుర్తించారు. వాట్సాప్ రెగ్యులర్ యూజర్లకు ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కంపెనీ ఈ ఫీచర్ రిలీజ్ తేదీని ఇంకా రివీల్ చేయలేదు.
ఈ ఫీచర్ వాట్సాప్‌లో అన్ని చాట్స్‌కు వర్తిస్తుంది. ఒకసారి ఎనేబుల్ చేశారంటే మీ వాట్సాప్ చాట్‌లు ఎక్కువ రోజులు ఉండవు. మళ్లీ తిరిగి పొందలేరు కూడా. మీకు కావాలంటే వాట్సాప్ మెసేజ్ స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు లేదంటే చాట్ ఓపెన్ చేసి మెసేజ్ కాపీ-పేస్ట్ చేసుకోవచ్చు.
