25.2 C
Hyderabad
September 20, 2026
జాతీయంహోమ్

అండమాన్ నికోబార్ దీవుల్లో ఘనంగా టీడీపీ ఆవిర్భావదినోత్సవం

#TDP

తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అండమాన్ నికోబార్ టీడీపీ అధ్యక్షుడు మాణిక్య యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. దీవుల్లో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలపై ఆయన వివరాలు వెల్లడించారు.

స్థానిక సంస్థల్లో టీడీపీ ప్రస్తుతం ద్వితీయ స్థానంలో నిలుస్తోందని మాణిక్య యాదవ్ తెలిపారు. అక్కడ చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఒకసారి అండమాన్ నికోబార్ దీవులకు పర్యటించాలని చంద్రబాబును ఆయన కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు, త్వరలోనే దీవుల్లో పర్యటిస్తానని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, తెలంగాణ నుంచి కూడా టీడీపీ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీ స్థాపన తర్వాతే తెలంగాణలో సామాన్య ప్రజలకు నిజమైన స్వాతంత్య్రం లభించిందని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత బక్కని నర్శింహులు పేర్కొన్నారు. రాష్ట్రంలో అంటరానితనం నిర్మూలనకు చంద్రబాబు చేసిన కృషి మరువలేనిదని ఆయన అన్నారు.

Related posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి

Satyam News

ఇంకొద్ది సేపటిలో 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Satyam News

ఆటోగ్యాస్ కొరతను అధిగమించడానికి ప్రజా రవాణా సేవల విస్తరణ

Satyam News

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోండి

Satyam News

అమెరికాలో అడవులను దగ్ధం చేస్తున్న కార్చిచ్చు

Satyam News

అందరికీ ఆరాధ్యులు పొట్టి శ్రీరాములు

Satyam News

Leave a Comment