25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

జగన్‌ మావిగన్‌పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌…!!

#Jagan

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ట్రోన్ మెటిరీయల్‌గా మారిపోయారు. జగన్‌ మోహన్‌ రెడ్డి తాజాగా తెరపైకి తెచ్చిన మావిగన్ ప్రతిపాదనను చూసి ప్రత్యర్థులే కాదు పార్టీ కేడర్‌ సైతం నవ్వుతోంది. మొత్తంగా జగన్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైసీపీ శ్రేణులకు తలనొప్పిగా మారాయి.

మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి భారీ ఎకనామిక్ జోన్ చేయాలన్న జగన్ మాటలు విన్న కార్యకర్తలకు  మళ్లీ 3 రాజధానుల కథే గుర్తొచ్చింది. జగన్‌ ఎప్పుడు ఏ ప్రతిపాదన ముందుకు తెస్తారో, ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తారో అర్థం కాని పరిస్థితిలో ఉంది ఫ్యాన్ పార్టీ కేడర్. జగన్‌ మాటలను సపోర్ట్ చేయలేక, ఇటు ఖండించలేక అయోమయంలో మునిగిపోయింది.

గత ఐదేళ్ల పాలనలో అమరావతిని కాదని విశాఖ, కర్నూలు అంటూ 3 ముక్కలాట ఆడిన జగన్‌, చివరికి ఏదీ పూర్తి చేయలేకపోయారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వాటి ఊసే ఎత్తకుండా, హఠాత్తుగా మావిగన్ అంటూ కొత్త రాగం అందుకోవడం రాజకీయ వర్గాల్లో కామెడీ సీన్‌గా మారింది. అసలు రాజధానికే దిక్కులేదు..ఇప్పుడు ఈ కొత్త ఎకనామిక్ జోన్ జపం దేనికంటూ సొంత పార్టీ నేతలే జగన్‌పై సెటైర్లు వేసుకుంటున్నారు.

కూటమి ప్రభుత్వం అమరావతిని మళ్లీ నిర్మించే పనిలో బిజీగా ఉంటే, జగన్ మాత్రం   కొత్త పేర్లను కనుగొనడంలో బిజీగా ఉన్నారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో నిలకడ ఉండాలి కానీ, ఇలా ప్రయోగాలు చేస్తే ప్రజలు నవ్వుతారంటూ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా అమరావతిని సమర్థించడమో లేదా వ్యతిరేకించే హక్కు జగన్‌కు ఉన్నప్పటికీ..కొత్త ప్రకటనలు చేయడం డైవర్షన్ మాత్రమేనని కేడర్ భావిస్తోంది.

నిజానికి పార్టీలో మార్పులు జరుగుతాయి, పాత తప్పులను సరిదిద్దుకుంటారని ఆశపడ్డ ఫ్యాన్ పార్టీ కార్యకర్తలకు మావిగన్‌ కామెంట్స్ రూపంలో బిగ్‌షాక్ ఇచ్చారు జగన్. అనూహ్యంగా వచ్చిన మావిగన్ స్టేట్‌మెంట్‌తో వైసీపీ కేడర్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయింది.

Related posts

గంజాయి పై ఉక్కు పాదం: ఎస్పీ ఎ.ఆర్.దామోదర్

Satyam News

జిందగీ నా మిలేగీ దుబారా 2 త్వరలో…..

Satyam News

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

సిరి మీడియా అక్రమాలపై దాసరి కుమారుడి ఫిర్యాదు

Satyam News

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News

తెలంగాణ విమోచన దినం అధికారికంగా నిర్వహించాలి

Satyam News

Leave a Comment