25.2 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

అరకు లోయ లో కనిపించిన భూమి

#Earthquake

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయతో పాటు పాడేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 11:31 గంటల సమయంలో సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని సామాగ్రి కదిలిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన వివరాల ప్రకారం, ఈ భూకంప కేంద్రం పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది. అరకు, పాడేరు ప్రాంతాలు ఒరిస్సా సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఇక్కడ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

Related posts

విద్యార్థులతో కలిసి బ్యాట్ పట్టిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్

Satyam News

‘గోదావరి పుష్కరాలు – 2027’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Satyam News

త్వరలో వస్తున్న సోనియాగాంధీ ఆత్మకథ

Satyam News

మరిడి అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ

Satyam News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 10 మంది మృతి

Satyam News

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియను పూర్తి చేయండి

Satyam News

Leave a Comment