మహబూబ్ నగర్హోమ్

మక్కజొన్న రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

#BRSParty

జోగులాంబ గద్వాల జిల్లాలో మక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న దారుణ పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. కురువ విజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు మల్దకల్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

రైతులు ఎన్నో ఆశలతో తమ మక్కజొన్న పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే అక్కడ గన్నీ బ్యాగులు లేక, తాట్ పారలు లేక, హమాలీలు లేక, ట్రాన్స్‌పోర్ట్ కోసం లారీలు లేక రోజుల తరబడి పంటను రోడ్లపైనే పడేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో అకాల వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోయిన మక్కజొన్న పూర్తిగా తడిసి మొలకలు రావడం ప్రారంభమైందని, రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని తెలిపారు.

చూస్తూ ఊరుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కష్టపడి పండించిన పంట కళ్లముందే నాశనం అవుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ రైతుల జీవితాలతో ఆడుకుంటోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.

ఎన్నికల సమయంలో రైతు సంక్షేమం పేరుతో గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రైతులను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. రైతు పంటను కొనుగోలు చేయలేని ప్రభుత్వం అధికారంలో కొనసాగడానికి నైతిక హక్కు లేదన్నారు.

ముఖ్యమంత్రి, జిల్లా అధికారులు వెంటనే స్పందించి మక్కజొన్న కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, పెండింగ్‌లో ఉన్న ధాన్యాన్ని వెంటనే లోడ్ చేసి తరలించాలని డిమాండ్ చేశారు. తడిసిపోయిన పంటకు ప్రభుత్వం పూర్తి పరిహారం చెల్లించాలని, రైతులపై ఉన్న రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు.

రాబోయే రెండు మూడు రోజుల్లో జిల్లాలోని కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న మక్కజొన్నను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి లారీల ద్వారా తరలించే చర్యలు చేపట్టకపోతే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గద్వాల కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రభుత్వం మరియు జిల్లా అధికారులను బీఆర్ఎస్ తరఫున హెచ్చరించారు.

రైతుల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని డా. కురువ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సిములు,లక్ష్మన్న,మల్లేష్, రాజు,మల్దకల్ తిరుమలేష్, ముద్దల్ తిమ్మప్ప, డోల్ కృష్ణ, రంగస్వామి, విఠలాపురం రాముడు. తదితర రైతులు పాల్గొన్నారు.

Related posts

రికార్డులు సృష్టిస్తున్న యువ హాకీ క్రీడాకారిణి జ్యోతి సింగ్

Satyam News

సీఎం చంద్రబాబుకు ఉద్యోగ సంఘాల ధన్యవాదాలు

Satyam News

ఏపీ సీఐఐ సమ్మిట్ తో అదిరిపోయిన గ్లోబల్ మీడియా

Satyam News

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమెదపరేం

Satyam News

శృంగారంపై సమంత వ్యాఖ్యలు వైరల్ !

Satyam News

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

Satyam News

Leave a Comment