25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ భరోసా

#TGSRTC

రోడ్డు ప్రమాదంలో విషాదం అలుముకున్న కుటుంబాలకు యూనియన్ బ్యాంక్ సహకారంతో టీజీఎస్ఆర్టీసీ అండగా నిలిచింది. వివిధ సమయాలలో విధి వంచించి అకాల మృత్యువు వెంటాడిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. పికెట్,  పరిగి డిపోలకు చెందిన డ్రైవర్లు సుధాకర్, శ్రీనివాసరెడ్డిలు  రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.  ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత డ్రైవర్ల కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఆపద సమయంలో యూబీఐ (యూనియన్ బ్యాంక్ )  సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు అక్కరకొచ్చింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటంతో ఉచిత ప్రమాద బీమా పథకం వర్తించింది. సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూనియన్ బ్యాంక్ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా  ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద యూబీఐ రూ. కోటి అందజేస్తోంది.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు బాధిత కుటుంబాలు ఒక్కొక్కరికి రూ. కోటి విలువైన చెక్కులను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఏం.రవీంద్రబాబు, రీజనల్ హెడ్ డి. వెంకటేశ్వర్లు లతో కలిసి టీజీఎస్ ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ  వై.నాగిరెడ్డి సోమవారం బస్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఎండీ నాగిరెడ్డి  మాట్లాడుతూ,  వేరు వేరు సమయాలలో  జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనలో పికెట్ , పరిగి డిపోలకు చెందిన ఇద్దరు  డ్రైవర్లు మరణించడం విచారకరమన్నారు. తమ తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో డ్రైవర్స్ అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. పోషణలో పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా  నిలుస్తుందని, ఆత్మ స్థైర్యం, ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు.

కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని ఎండీ నాగిరెడ్డి  సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈడీ సిహెచ్.వెంకన్న, ఫైనాన్స్ అడ్వైజర్ విజయపుష్ప , సీపీఎం ఉషాదేవి, యూబీఐ అధికారులు  పాల్గొన్నారు.

Related posts

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా పాలన

Satyam News

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే తిరుగుబాటు తప్పదు!

Satyam News

విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు వందేమాతరం అవార్డు

Satyam News

మైనర్ బాలిక దారుణ హత్య: ఉద్రిక్తత

Satyam News

అమెరికా స్థావరాలపై దాడులు ఆపని ఇరాన్

Satyam News

పాకిస్తాన్ కు కొత్త షాక్ ఇచ్చిన మోడీ ప్రభుత్వం

Satyam News

Leave a Comment