25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

న్యాయమూర్తి ఎదుటకు బాల్క సుమన్

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు హిమాయత్‌నగర్‌లోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన సందర్భంలో తీవ్ర ఉద్రిక్తత, హైడ్రామా చోటుచేసుకుంది. బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆయనను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టేందుకు హిమాయత్‌నగర్‌లోని సదరు జడ్జి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌కు తరలించారు.

అయితే, నిందితుడిని నేరుగా అపార్ట్‌మెంట్‌ లోపలికి, తన ఫ్లాట్ వద్దకు తీసుకురావడంపై సదరు న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలను పక్కనబెట్టి అపార్ట్‌మెంట్‌ పైకి తీసుకురావడంపై పోలీసుల తీరును తప్పుబడుతూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో పోలీసులు వ్యవహరించిన శైలిపై ఆక్షేపణ తెలిపిన జడ్జి, నిందితుడిని కిందనే ఉంచాలని, తానే స్వయంగా కిందికి వచ్చి విచారిస్తానని పేర్కొన్నారు. దీంతో బాల్క సుమన్, ఆయన తరపు న్యాయవాదులు, పోలీసులు అపార్ట్‌మెంట్ కిందనే వేచి చూడాల్సి వచ్చింది.

నివాస సముదాయాల్లోని ప్రైవసీ, భద్రతా ప్రమాణాలను విస్మరించి నిందితుడిని నేరుగా ఫ్లాట్ వద్దకు తీసుకురావడం పట్ల న్యాయమూర్తి వ్యక్తంచేసిన అసహనం అక్కడ కాసేపు కలకలం రేపింది. ఈ ఘటనపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు న్యాయశాఖ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Related posts

పరిహారం ఇవ్వకుండా మత్స్యకారులను వేధించిన వైసీపీ

Satyam News

ఇరాన్ కు మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

Satyam News

లిక్కర్ కేసులో ఈడీ ఎంట్రీ..విజయసాయికి నోటీసులు..??

Satyam News

చట్టాన్ని గౌరవించాలి సంయమనం పాటించాలి

Satyam News

మకర సంక్రాంతి తేదీపై వివాదం: పుణ్యకాలం పోతే పండగ ఎందుకు?

Satyam News

మానవ జీవితం గొప్పగా ఉండేందుకే సనాతన ధర్మం

Satyam News

Leave a Comment