26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఆంధ్రప్రదేశ్ మేల్కొంది దేశం, ప్రపంచం చూస్తోంది!

#CBNAward

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో, దిగ్గజ పారిశ్రామికవేత్తల సమక్షంలో రేపు జరగనున్న ‘ఎకనామిక్ టైమ్స్ 26వ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల’ వేడుకలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకోబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు.

సునీల్ భారతి మిట్టల్, సజ్జన్ జిందాల్, ఉదయ్ కొటక్, డాక్టర్ దేవిశెట్టి, నోయెల్ టాటా వంటి దిగ్గజాలతో కూడిన అత్యున్నత జ్యూరీ చంద్రబాబును ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. గతంలో అశ్విని వైష్ణవ్, ఎస్. జైశంకర్, నిర్మలా సీతారామన్, అరుణ్ జైట్లీ వంటి కేంద్ర మంత్రులు మాత్రమే అందుకున్న ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రకటించడం అంటే అది ఆంధ్రప్రదేశ్ పాలనా సంస్కరణలకు లభించిన అత్యున్నత గుర్తింపు.

భారతదేశానికి వస్తున్న మొత్తం పెట్టుబడులలో దాదాపు నాలుగో వంతుకు పైగా ఆంధ్రా ఆకర్షించడం, ఐదేళ్లు ఆకలితో ఉన్న సింహం వేటను తలపించింది. ఆంధ్రప్రదేశ్ వైపు భారీ పెట్టుబడులు మళ్లించడంలో చంద్రబాబు అనుసరించిన విధానాలు అత్యంత కీలకం. ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ నుండి గూగుల్ వరకు, రెన్యూ నుండి రిలయన్స్ వరకు లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాది ఉద్యోగాల జాతర మొదలైంది.

దీని వెనుక ఉన్న ఆయన అలుపెరగని నిరంతర కృషి, పట్టుదల అసామాన్యం. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీతో పాటు ఏకంగా 22 రంగాలకు కొత్త పాలసీలను తీసుకువచ్చారు. ‘నాలా’ (NALA) చట్టం అడ్డంకులను తొలగించి, టూరిజానికి కూడా ‘ఇండస్ట్రీ స్టేటస్’ కల్పించారు. తైవాన్, కొరియా, చైనా, జపాన్ దేశాల పార్కులు, ఆర్థిక మండళ్ల కారిడార్లు, డ్రోన్ నుండి క్వాంటం వరకు టెక్నాలజీ, తయారీ నుండి రెన్యువబుల్ ఎనర్జీ రంగాల వరకు ఏదీ వదలకుండా.. కేంద్రాన్ని సంప్రదించి, పెట్టుబడిదారులకు భరోసానిచ్చే ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించి, విజయం సాధించారు.

చంద్రబాబు పాలనలో “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” అనేది కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కనిపిస్తోంది. పారదర్శకమైన సింగిల్ విండో విధానం, డూయింగ్ బిజినెస్” అనేది కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కనిపిస్తోంది. పారదర్శకమైన సింగిల్ విండో విధానం, భూమి, నీరు, విద్యుత్, మౌలిక వసతులు, ఇన్వెస్ట్‌మెంట్ సబ్సిడీల కోసం ఎస్క్రో ఖాతా వంటి సంచలన దార్శనికత పెట్టుబడిదారులకు గొప్ప భరోసానిచ్చాయి.

“బిజినెస్ రిఫార్మర్” అంటే కేవలం చట్టాలను మార్చడం కాదు; ఆ సంస్కరణల ద్వారా క్షేత్రస్థాయిలో సంపద సృష్టి జరగడం. రేపు ముంబై వేదికగా ఆయన అందుకోబోతున్న ఈ పురస్కారం, రేపటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతికి ఒక గొప్ప మైలురాయి. ఇది రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక విప్లవానికి మరింత ఊతాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

సంస్కరణల దిశగా రాష్ట్ర ప్రయాణంలో, చంద్రబాబు నాయకత్వానికి దక్కుతున్న ఈ గొప్ప గౌరవం మనందరికీ గర్వకారణం.

Related posts

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఇంజిన్‌గా భారతదేశం

Satyam News

వినుకొండ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన సీఐ చిన మల్లయ్య

Satyam News

దర్శకుడు పీసీ ఆదిత్య కు గౌరవ డాక్టరేట్

Satyam News

ఏపీలో ఈ హాస్పిటల్… దేశంలో ఎక్కడున్నా వైద్యం

Satyam News

ఫుట్‌పాత్ ఆక్రమణలపై అధికారుల కొరడా

Satyam News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి మరో రూ. 8 వేల కోట్ల సాయం

Satyam News

Leave a Comment