ముఖ్యంశాలుహోమ్

వచ్చే దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేస్తాం

#SridharBabu

మొదటి దశలో కేటాయింపులు జరిగిన ఇందిరమ్మ ఇళ్లను ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని ఐటి, పరిశ్రమలు, రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో ఏళ్ల తరబడి నిర్మాణాలు కొనసాగేవని అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదని ఆయన అన్నారు.

బుధవారం నాడు ఘట్కేసర్ మండలం పోచారంలో 480 మందికి కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శ్రీధర్ బాబు ప్రసంగించారు. రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగేలేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇందిరమ్మ టవర్స్ కు రోడ్లు, మంచినీటి సదుపాయం, లిప్ట్ లాంటి మౌలిక సదుపాయాలను గడువులోగా పూర్తి చేస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చిన మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, తెల్ల రేషన్ కార్డులపై ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు.

ఇళ్లు లేని పేదలకు వారి సొంత నియోజకవర్గం పరిధిలోనే ఇందిరమ్మ గృహాలను నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. అత్యంత విలువైన భూముల్లో వీటిని నిర్మిస్తున్నామని వివరించారు. పోచారం ప్రాంతంలో సింగిల్ బెడ్ రూం కొనాలన్న రూ.40 లక్షలు ఖర్చవుతుందని అటువంటిది ఆరు లక్షలు భరిస్తే అంతకంటే విలువైన ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.

సిఎం రేవంత్ రెడ్డి, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు దీన్నొక యజ్ణంలా చేపట్టారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇళ్ల కేటాయింపులు అత్యంత పారదర్శకంగా మానవ ప్రమేయం లేకుండా లాటరీ పద్ధతిలో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 25 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి దశల వారిగా ఇందిరమ్మ గృహాలను నిర్మించి ఇస్తామని వివరించారు.

Related posts

జగన్‌కు బిగ్‌షాక్…10,700 ఎకరాల బ్రాహ్మణి స్టీల్స్ భూములు సీజ్!

Satyam News

నమ్మిన భక్తుల కల్పతరువు శ్రీ తిమ్మప్ప స్వామి

Satyam News

ఏపీ సర్కార్‌పై సంచలన సర్వే… చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ షాక్‌

Satyam News

భోగాపురం ఎయిర్‌పోర్టు..ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్.!

Satyam News

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

Satyam News

మార్చి తో ముగియనున్న సి ఎస్ పదవీకాలం

Satyam News

Leave a Comment