హైదరాబాద్హోమ్

మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్

#Talasani

మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ గ్రౌండ్ లో ముస్లీం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రార్ధనలకు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వేలాదిమంది ముస్లీం సోదర సోదరీమణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో ప్రార్ధనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో కుల మతాలకు అతీతంగా ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం జరుగుతుందని గుర్తు చేశారు.

ఎమ్మెల్యే వెంట సనత్ నగర్ డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, రాజేష్ ముదిరాజ్, బాలరాజ్, ఫాజిల్, ఖలీల్, జమీర్, గోపిలాల్ చౌహన్, వనం శ్రీనివాస్, సమి ఉల్లా తదితరులు ఉన్నారు.

Related posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి

Satyam News

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరుమెదపరేం

Satyam News

అమెరికా లో అరకు కాఫీ… న్యూయార్క్ లో ఆనంద్ మహేంద్ర స్టోర్

Satyam News

ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులే ఉపయోగించుకోవాలి

Satyam News

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

Satyam News

ఒంటిమిట్ట లో టీడీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన చమర్తి

Satyam News

Leave a Comment