హైదరాబాద్హోమ్

బియ్యం ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు

#UttamkumarReddy

తెలంగాణలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోనీ ఓ ప్రవైట్ హోటల్ లో  కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన మల్టీ విటమిన్ రైస్ ఉత్పత్తులను సోమవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బియ్యానికి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

“ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది గానీ ఎగుమతుల కోసం కాదని, అందుకే తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానంతో ముందుకు వెళ్లి బియ్యం ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతోంది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర రైతులు, రైస్ మిల్లర్ల ప్రయోజనాల కోసం దేశీయ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లను కూడా లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎగుమతులు చేపట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన అనుమతులను సైతం వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

తెలంగాణ వ్యవసాయ రంగం సాధించిన ప్రగతిని వివరిస్తూ మంత్రి మాట్లాడుతూ, ఈ ఏడాది యాసంగి సీజన్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం 81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, అదే సమయంలో భౌగోళికంగా పెద్ద రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు మాత్రమే జరిగిందని పేర్కొన్నారు.

“ఇది తెలంగాణ వ్యవసాయ సామర్థ్యానికి, రైతుల శ్రమకు, మా ప్రభుత్వ రైతు అనుకూల విధానాలకు నిదర్శనం” అని ఆయన అన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటికే రూ.19,303 కోట్లను నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. పారదర్శకతతో, వేగవంతంగా రైతులకు చెల్లింపులు జరిపిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

వానాకాలం, యాసంగి సీజన్లను కలిపి చూస్తే రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి 300 లక్షల మెట్రిక్ టన్నులు (300 ఎల్‌ఎంటీలు) దాటిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల వినియోగం సంవత్సరానికి కేవలం 36 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉండటంతో తెలంగాణ ఇప్పుడు మిగులు బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు.

రైస్ పరిశ్రమ ఆధునిక సాంకేతికతను స్వీకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మల్టీ విటమిన్ రైస్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి ఆదరణ పొందే అవకాశముందని చెప్పారు.

“తెలంగాణలో మాత్రమే విక్రయాలపై ఆధారపడకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవాలి. రాష్ట్ర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లకు చేరేలా ప్రభుత్వం అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తుంది” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ, సాగునీటి విస్తరణ, రైతులకు నిరంతర నీటి లభ్యత కల్పించడం వల్లే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. సాగునీటి రంగంలో ప్రభుత్వం చేపట్టిన భారీ పెట్టుబడుల ఫలితంగానే తెలంగాణ దేశంలో అగ్రగామి ధాన్య ఉత్పత్తి రాష్ట్రంగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు.

రైతుల ఆదాయం పెరగడం, రైస్ మిల్లింగ్ పరిశ్రమ బలోపేతం కావడం, బియ్యం ఎగుమతుల ద్వారా తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Related posts

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

Satyam News

దర్శకుడు పి సి ఆదిత్య కు శ్రీకృష్ణదేవరాయలు స్మారక పురస్కారం

Satyam News

అజిత్ పవార్ విమానం కూలింది ఇలా…

Satyam News

ఐఆర్జీసీ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్

Satyam News

ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైసీపీ గూండాల దాడి

Satyam News

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News

Leave a Comment