ప్రత్యేకంహోమ్

చకచకా 22ఎ నిషేధిత జాబితా భూములకు విముక్తి

#ChandrababuNaidu

గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో భూ బకాసురులు.. రైతులు, భూ యజమానులు, పేదల భూములను అడ్డగోలుగా దోచుకున్నారు. ఇందుకోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు. రీ సర్వే పేరుతో రైతులకు లేనిపోని సమస్యలు సృష్టిచండంతో పాటు ఉన్న పొలం కంటే తక్కువ విస్తీర్ణం పట్టాదారుపుస్తకాల్లో చూపించింది.

దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. లెక్కలేనన్ని సమస్యలు రెవెన్యూ శాఖలో సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెట్టడానికి చాలా శ్రమించాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా భూములకు సంబంధించిన ఫిర్యాదులే 90 శాతం వస్తున్నాయంటే గత ప్రభుత్వం ఏ స్థాయిలో సమస్యలు సృష్టించిందో అవగాహన చేసుకోవచ్చు.

రెవెన్యూ సమస్యల్లేని రాష్ట్రంగా ఏపీ ఉండాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూశాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ మార్గదర్శకంలో ఈ రెండేళ్లలో ఎన్నో సంస్కరణలను రెవెన్యూ శాఖలో తీసుకొచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటి నల్ల చట్టాన్ని, ఇబ్బందికరంగా ఉన్న నాలా చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేందుకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిటేడ్ యాక్ట్‌ను తీసుకొచ్చారు.

రైతులకు ఊరట కలిగించేందుకు ఆర్‌ఓఆర్ యాక్ట్‌ను సవరించారు. రీ సర్వేపై గ్రామసభలు, అన్ని రకాల భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు నిర్వహించి అక్కడిక్కడే రైతుల సమస్యలను పరిష్కరించారు. రీ సర్వే 2.0లో రైతలను భాగాస్వాములను చేసి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో వివాదాలకు తావులేని భూ రికార్డులను రూపొందిస్తున్నారు.

రెవెన్యూ వ్యవస్థలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మున్సిపల్ శాఖలను అనుసంధిస్తూ భూములకు డిజిటల్ భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. రైతులే నేరుగా అన్లైన్లో తమ భూములకు సంబంధించి 1బి, అడంగల్‌కు సొంతంగా డిజిటల్ లాక్ చేసుకునే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో రైతుల అనుమతి లేకుండా ఏ అధికారి కూడా ఆ భూమిని మ్యుటేషన్ గానీ, రిజిస్ట్రేషన్ గానీ చేయడానకి వీళ్లేదు. అలాగే 15 రకాల భద్రతా అంశాలతో రాజముద్రతో పకడ్బందీగా రూపొందించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను కూడా రైతులకు ప్రభుత్వం అందిస్తోంది.

22ఎ నిషేధిత భూములకు విముక్తి

రైతులు తరతరాలుగా సాగు చేసుకుంటూ, భూ యజమాన్య హక్కులు కలిగి ఉండి కూడా గత ప్రభుత్వ నిర్వాకంతో భూములు 22ఎ నిషేధిత జాబితాలో ఉండడంతో ఇబ్బందులకు గురౌతున్నారు. వైసీపీ ప్రభుత్వం రీ సర్వే పేరుతో భూములు కొట్టేయాలనే దుర్భుద్దితో అనేక వందల ఎకరాలను 22ఎ జాబితాలో చేర్చింది.

రైతుల ఇబ్బందులను గమనించిన కూటమి ప్రభుత్వం ఐదు రకాల భూములైనటువంటి… నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములు, మాజీ సైనికాధికారులు భూములు, స్వాతంత్ర్య సమర యోధుల భూములు, రాజకీయ బాధితుల భూములు, 1954కు అసైన్ చేసిన భూములు, ఒకే సర్వే నెంబర్ కారణంగా 22ఎ జాబితాలోకి వెళ్లిన భూములకు విముక్తి కలిగించింది. అంతేకాదు 22ఏ జాబితా నుంచి తొలగింపు ప్రక్రియను కూడా చాలా సులభతరం చేసింది.

9 రకాల పత్రాల్లో ఏ ఒక్క పత్రం ఉన్నా ఈ భూములకు 22ఎ నుండి విముక్తి లభిస్తుంది. దీంతోపాటు ఏళ్ల పాటు నుండి సమస్యాత్మకంగా ఉన్న గ్రామ సర్వీసు ఈనామ్ భూములకు కూడా మోక్షం కల్పించారు. 1.3 లక్షల గ్రామ సర్వీసు ఇనామ్ భూములకు పూర్తి హక్కులు కల్పించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే 33 వేల ఎకరాల షరతులగల పట్టా భూములను కూడా 22ఎ జాబితా నుండి తొలగించారు. ఈ భూములను రైతులు నిరంభ్యతరంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చు.

అవసరాలకు విక్రయించుకోవచ్చు. అదేవిధంగా చుక్కల భూముల జాబితాలో ఉండి 22ఎలో ఉన్న మరో లక్షా 90 వేల ఎకరాల భూములకు మరికొన్ని రోజుల్లో విముక్తి కలిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వబోతోంది. ఇప్పటికే ఈ భూములపై ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. రైతులు, భూ యజమానుల హక్కుల పరిరక్షణ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రానున్న కాలంలో ఈ అడుగులు మరింత వేగంగా పడబోతున్నాయి.

పేదలకు పెద్ద ఊరట… లక్షల ఇళ్ల స్థలాలపై పూర్తి హక్కులు

ఎన్టీఆర్ ప్రభుత్వ కాలం నుంచి పేద ప్రజలకు అసైన్డ్ చేసిన ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితా నుండి తొలగించి వారికి పూర్తి హక్కులు కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 10 ఏళ్ల కాలం ముగిసిన అసైన్డ్ ఇళ్ల స్థలాలన్నింటికీ రిజిస్ట్రషన్ చేసి పూర్తి హక్కులు కల్పించాలని, అసైన్డ్ పట్టా, ఇంటి పన్ను రసీదు తప్ప మరేమీ కోరకుండా రిజిస్ట్రేషన్ చేయాలని రిజిస్ట్రార్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఈ స్థలాలు 22ఎలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములకు సంబంధించి ఇళ్ల పట్టాలు, ఇళ్లు రెగ్యులరైజేషన్ చేసుకున్న వారికి రెండేళ్లలోనే పూర్తి హక్కులు కల్పించింది. దీంతో పట్టణ పేదలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించింది. అలాగే పేదలకు ఇళ్ల పథకం కింద అసైన్డ్ స్థలాలు పొందిన పేదలందరికీ కూడా పట్టా పొందిన రెండేళ్లకే పూర్తి హక్కులు కల్పించాలని ఆలోచిస్తోంది. దీనిపై త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం వెలువడనుంది. ఇక పట్ణణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న 10 వేల కుటుంబాల గృహాలను రెగ్యులరైజ్ చేసింది. మరో 25 వేల గృహాలను త్వరలో క్రమబద్దీకరించనున్నారు.

గ్రామకంఠాల్లో తరతరాలు ఇంటి స్థలాలు కలిగి ఉన్న, ఇళ్లు నిర్మించుకున్న వారికి లింక్ డాక్యుమెంట్లు లేనప్పటికీ…వారికీ పూర్తి హక్కులను ప్రభుత్వం కల్పించింది. ఈ నిర్ణయాల ద్వారా లక్షల సంఖ్యలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాలపై పూర్తి హక్కులు లభించనున్నాయి. ఈ రెండేళ్లో కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వంగా వ్యవహరించింది.

ఏళ్ల తరబడి పెండింగ్ సమస్యలకు పరిష్కారం

ఒకవైపు రెవెన్యూ వ్యవస్థలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తూనే మరోవైపు ఒక గ్రామానికో, కొందరి రైతులకో పరిమితమై ఏళ్లగా పరిష్కారం కాని భూ సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక్ చొరవతో పరిష్కరించబడ్డాయి. తిరుపతి జిల్లాలోని శెట్టిపల్లి గ్రామంలో రెండు వేల కోట్ల రూపాయల విలువ చేసే 380 ఎకరాల భూమిని 2,111 మంది లబ్దిదారులకు అన్ని అడ్డుంకులను తొలగించి అప్పగించారు.

శ్రీసత్య సాయి జిల్లా నల్లమడ మండలం గోపెపల్లి గ్రామంలో 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న 305 ఎకరాలకు పరిష్కారం చూపి రైతుల కళ్లల్లో ప్రభుత్వం ఆనందం నింపింది. ఏలూరు జిల్లాల్లో ఒక్క రోజులోనే 142 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి భూ యాజమానులకు ఊరటనిచ్చారు. సత్యసాయి జల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లి గ్రామంలో 13.59 ఎకరాల్లో ఉన్న ఇళ్ల పట్టాల భూములు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండగా నిషేధిత జాబితా నుండి తొలగించి 226 కుటంబాలకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం కల్పించింది.

Related posts

చంద్రబాబు చొరవ తో ఏపీకి ఈ రూట్‌లో కొత్త రైల్వే లైన్

Satyam News

నాగర్ దొడ్డి గ్రామ వాసికి డాక్టరేట్

Satyam News

తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఏ మేరకు?

Satyam News

రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించాలి

Satyam News

యువకుల చేతిలో దాడికి గురైన వ్యక్తి మృతి

Satyam News

భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్

Satyam News

Leave a Comment