26.3 C
Hyderabad
September 27, 2026
కృష్ణహోమ్

బొండా ఉమా వివరణ తీసుకోండి.. చంద్రబాబు ఆదేశాలు

#BondamUma

వైకాపా నేతలతో కలిసి వేదికను పంచుకోవడంపై.. తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమా నుంచి వివరణ తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన బాధ్యతను తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడికి అప్పగించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను నిత్యం బజారు భాషలో దూషించే విపక్ష నేత అంబటి రాంబాబుతో బొండా ఉమా వేదిక పంచుకోవడం శ్రేణులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కూటమిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించిన శత్రువుతో ముచ్చట్లు పెడుతూ చిరునవ్వులు చిందించడం పట్ల తెలుగు దేశం , జనసేన రెండు వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అయింది.

కూటమి ప్రభుత్వంపై కాపుల్లో ఉన్న అపారమైన నమ్మకాన్ని సడలించేలా ప్రవర్తించడం అంటే తిన్నింటి వాసాలు లెక్కపెట్టడమే అని ,ఇది పొత్తు ధర్మానికి, పార్టీ నిబంధనలకు తీవ్ర విఘాతం కలిగించడమే అని విమర్శలు తలెత్తాయి. అయితే, ఈ నోటీసులకు ఆయన ఎలాంటి వివరణ ఇస్తారో కానీ, పార్టీ నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘించిన బొండా ఉమా తీరుపై సొంత పార్టీ నేతలు, కూటమి శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

చేదుకో కోటయ్య…. కిటకిటలాడుతున్న కోటప్పకొండ

Satyam News

వంద కోట్ల విలువైన స్ధలం కబ్జా చెర నుంచి విముక్తి

Satyam News

సోషల్ మీడియా సైట్లపై నిషేధం: భగ్గుమన్న నేపాల్

Satyam News

ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండండి

Satyam News

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న చంద్రబాబు

Satyam News

Leave a Comment