30.3 C
Hyderabad
September 23, 2026
ముఖ్యంశాలుహోమ్

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం: 41 మంది మృతి?

#Indonesia

ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఘోర నౌక ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో నౌకలో మొత్తం 271 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు సమాచారం. మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు ప్రాణభయంతో సముద్రంలోకి దూకినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యల్లో పలువురిని సురక్షితంగా రక్షించినప్పటికీ, ఇంకా 41 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం నౌకాదళం, కోస్ట్ గార్డ్, స్థానిక రక్షణ బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

వీరంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించిన ఇండోనేషియా అధికారులు, నౌకలో మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై విచారణ చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related posts

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి జాత‌ర‌కు ఉగ్రవాదుల ముప్పు?

Satyam News

ఏలూరులో హైకోర్టు న్యాయమూర్తుల పర్యటన

Satyam News

పసికందును అమ్మిన తల్లి అరెస్టు

Satyam News

దేశ మహిళలను మోసం చేసిన బీజేపీ

Satyam News

డ్రగ్స్ రహిత తెలంగాణ సాధిద్దాం

Satyam News

ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసు పై చంద్రబాబు సీరియస్

Satyam News

Leave a Comment