ఆధ్యాత్మికంహోమ్

దసరా శరన్నవరాత్రి విశేష సేవల ఆన్‌లైన్ టికెట్ల విడుదల

#AnamRamnarayanareddy

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తుల కోసం అందుబాటులోకి తెచ్చిన ప్రత్యక్ష విశేష ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్లను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

కార్యక్రమం ప్రారంభంలో ఆలయ స్థానాచార్యులు, అర్చక బృందం వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రివర్యులకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం మంత్రి ఆనం ఆన్‌లైన్ విధానంలో విశేష సేవల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ  దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిర్వహించే పవిత్ర విశేష సేవల్లో భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనేందుకు వీలుగా ఆన్‌లైన్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

భక్తుల సౌకర్యం, పారదర్శకత, సులభతరమైన సేవలందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ – 9552300009 ద్వారా నిర్ణీత సంఖ్యలో విశేష సేవా టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

భక్తులు ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక చండీ హోమం, ప్రత్యేక దేవీ ఖడ్గమాలార్చన, ప్రత్యేక శ్రీచక్ర నవావరణార్చన వంటి విశేష సేవల్లో పాల్గొనేందుకు ముందుగానే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని మంత్రి సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దేవాలయ సేవలను మరింత పారదర్శకంగా, భక్తులకు సులభంగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ‘మన మిత్ర’ వంటి డిజిటల్ సేవల ద్వారా భక్తులకు ఆలయ సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

దసరా మహోత్సవాలకు మంత్రికి ఆహ్వానం

విశేష సేవల టికెట్ల విడుదల అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, అర్చక బృందం కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శరన్నవరాత్రి మహోత్సవాల తొలి అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేసి దసరా మహోత్సవాలకు సాదరంగా ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్, ఉప ప్రధాన అర్చకులు బి. శంకర శాండిల్య, ముఖ్య అర్చకులు ఆర్. శ్రీనివాస శాస్త్రి, అమరావతి సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో ద‌ర్శ‌నం ప్రారంభం

Satyam News

వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి కన్నుమూత

Satyam News

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

Satyam News

సునీతకు తీరని అన్యాయం చేసిన జగన్

Satyam News

డీప్‌ఫేక్ కలకలం: మహిళ ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు!

Satyam News

జగన్ APPSC గ్రూప్-1 ప్రక్రియలో వెలుగు చూసిన అక్రమాలు!

Satyam News

Leave a Comment