పశ్చిమగోదావరిహోమ్

పోలవరంలో నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక పరీక్షలు

#Polavaram

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని కేంద్ర మృత్తిక, పదార్థాల పరిశోధన కేంద్రం (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) నిపుణులు క్షేత్రస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ పరీక్షలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ప్రతినిధుల సమక్షంలో నిపుణులు వివిధ ప్రాంతాల్లో నాణ్యతను పరిశీలిస్తున్నారు.

సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణులు హరీంద్ర ప్రకాశ్‌, శ్రీహరి టి. నాయర్‌, అమిత్‌ సేన్‌ ఈ పరీక్షల్లో పాల్గొంటున్నారు. జలవనరుల శాఖ ఈఈ బాలకృష్ణమూర్తి, డీఈలు నిర్మల, శ్రీకాంత్‌, విజయ్‌, మల్లికార్జున, పటేల్‌, ఎంఈఐఎల్‌ పోలవరం ప్రాజెక్టు జనరల్‌ మేనేజర్‌ ఏ. గంగాధర్‌ కుమార్‌, డీజీఎంలు గుట్టపాటి శంకరయ్య, మురళి పమ్మి తదితరులు నిపుణులకు సహకరిస్తున్నారు.

సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణులు ప్రతి నెలా పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిర్మాణ నాణ్యతను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాము ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించడంతో పాటు, మరికొన్ని చోట్ల నమూనాలను సేకరించి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరిశీలిస్తున్నారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణంలో వినియోగిస్తున్న మట్టి, రాయి, ఇసుక నాణ్యతతో పాటు, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా వాటి సాంద్రత, కుదింపు స్థితి ఉన్నాయా లేదా అన్నది పరీక్షిస్తున్నారు.

వాటర్‌ రీప్లేస్‌మెంట్‌ పద్ధతిలో పరీక్ష

తొలిరోజు కీలకమైన నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు గ్యాప్‌-1 ఎగువ వైపు (అప్‌స్ట్రీమ్‌) 0 నుంచి 200 మీటర్ల పరిధిలో రాక్‌ఫిల్‌ (3ఏ)పై వాటర్‌ రీప్లేస్‌మెంట్‌ పద్ధతిలో సాంద్రత (డెన్సిటీ) పరీక్ష చేపట్టారు. షీప్‌ఫుట్‌ రోలర్‌తో మట్టిని కుదించిన అనంతరం దాని సాంద్రత, తేమ పరిస్థితులను కూడా పరిశీలించారు. నిర్మాణంలో వినియోగించే పదార్థాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అన్నది నిపుణులు తనిఖీ చేస్తున్నారు. గ్యాప్‌-2లోనూ ఈ పరీక్షలు కొనసాగాయి.

Related posts

ఐబీ నూతన డైరెక్టర్ గా మహేష్ దీక్షిత్

Satyam News

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి.!

Satyam News

మారుతున్న భారతావనికి నిదర్శనం ఆపరేషన్ సిందూర్

Satyam News

ప్రజా పాలన కు 99 రోజుల యాక్షన్ ప్లాన్

Satyam News

మంత్రి కొండా సురేఖను కలిసిన శైలజా రామయ్యర్

Satyam News

Leave a Comment