26.7 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

వైసీపీని భయపెట్టిన జగన్‌ టూర్‌…!!

#jagan

ఇదేంటి టైటిల్‌ ఇలా ఉందనుకుంటున్నారా….?? ఇది అక్షరాలా నిజం. మొంథా తుఫాన్‌ బాధితులను పరామర్శించడానికి బెంగళూరు నుండి సడెన్‌గా విజయవాడలో ఊడిపడ్డాడు వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి. తుఫాన్‌ ప్రభావం ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఆయన విజయవాడలో ఉన్నారు. నాడు కాలు తీసి అడుగు కూడా బయట పెట్టలేదు జగన్‌. ఒక్క ప్రెస్‌ మీట్‌తో సరిపెట్టి ఎకాఎకి ఫ్లయిట్ ఎక్కి బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌లో సేద తీరాడు. వారం రోజుల తర్వాత మంగళవారం పోలోమంటూ విజయవాడకి గెస్ట్‌ అప్పియరెన్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు జగన్‌.

తాను వస్తే.. రోడ్లన్నీ నిండిపోతాయి.. జగన్‌ అంటే జనం, జనం అంటే జగన్‌ అని తెగ ఊదరకొట్టిన వైసీపీ నేతలు, కార్యకర్తలకు తాజా పర్యటన చూసి మైండ్‌ బ్లాంక్‌ అయిందని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.. జనాన్ని పోగు చేయడంలో వైసీపీ నేతలు ఫెయిల్ అయ్యారో… జగన్‌పై ప్రజల్లో క్రేజ్‌ తగ్గి గ్రాఫ్‌ పడిపోయిందో… లేక, అయిదేళ్లు ప్రజల్ని తన పరిపాలనతో విసిగించి వేసారేలా చేసిన జగన్‌పై అసహనం, ఆగ్రహం ఇంకా చల్లారలేదో తెలియదు కానీ క్రౌడ్‌ ఏమాత్రం కనిపించలేదు..

సాక్షి ఆన్‌లైన్‌ పేపర్‌లో ప్రచురించిన ఈ ఫోటోలను చూస్తేనే పిక్చర్‌ క్లారిటీ రావడం ఖాయం. గతంలో డ్రోన్‌ షాట్‌లు, బిల్డింగ్‌లు, షాపులు, టవర్‌లు ఎక్కి మరీ కవర్‌ చేసిన ఆయన టీమ్‌ నేడు క్లోజ్‌ అప్‌ ఫోటోలకే పరిమితం అయిందంటే సీన్‌ అర్ధం చేసుకోవచ్చు..

మరోవైపు, వైసీపీ అధినేత పర్యటనలు అంటే జనాలు భయపడుతున్నారు.. ఆయన పర్యటనలు, పరామర్శలలో జరుగుతోన్న వరస ఘటనలతో భయబ్రాంతులకు లోనవుతున్నారు. సత్తెనపల్లి, పొదిలి, చిత్తూరు పరామర్శలలో దాడులు జరగడంతో అటు వైపు వెళ్లకూడదని భావిస్తున్నారు ప్రజలు. మొత్తమ్మీద, జగన్‌కి జనం దూరం అయ్యారు, ఆయన గ్రాఫ్‌ పడిపోయిందనే టాక్‌.. ఈ పర్యటనలో క్లియర్‌ అయిందని చెబుతున్నారు రాజకీయ పండితులు.. ఇక, జగన్‌ అంటే నో జనం, జనం అంటే నో జగన్‌ అనే పాట పాడాలని కౌంటర్‌లు ఇస్తున్నారు ప్రత్యర్ధి పార్టీలు.. ఇదే, వైసీపీ నేతలని భయపెడుతోంది.

Related posts

ఎన్నికల కేసుల నుంచి డి కే అరుణ కు విముక్తి

Satyam News

ఎన్నికల వ్యవస్థపై రాహుల్ ‘జ్ఞానోదయం’.!

Satyam News

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వాన

Satyam News

అమరావతిలో గ్లోబల్ లీడర్ షిప్ కేంద్రం

Satyam News

అలంపూర్ క్షేత్రంలో ఆగమ సంప్రదాయాలు పాటించాలి

Satyam News

రేపటి నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు

Satyam News

Leave a Comment