26.7 C
Hyderabad
September 20, 2026
పశ్చిమగోదావరిహోమ్

షాడో గుప్పిట్లో మెడికల్ కాలేజీ విలవిల

#Doctor

ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న ఒక మిషనరీ వైద్య విద్య మెడికల్ కాలేజీలో నాన్ మెడికల్ టీచింగ్ స్టాఫ్ (ఫిజికల్ డైరెక్టర్) ఒకరు కాలేజిలో షాడో కరస్పాండెంట్ గా హవా సాగిస్తున్నట్టు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాలేజిలో అడ్మిషన్ ల వ్యవహారాలలో మెడికల్ సీట్ల కు సంబంధించి రేట్లు నేరుగా విద్యార్దులతో బేర సారాల దగ్గరనుండి కాలేజీకి సంబందించిన ఆర్థిక వ్యవహారాలన్నీ ఈ షాడో కరస్పాండెంట్ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ ఔతున్నాడని కాలేజిలో కొంత మంది బహిరంగం గానే చెప్పుకుంటున్నారు.

ఈ కాలేజిలో కరస్పాండెంట్, షాడో కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్న ఫిజికల్ డైరెక్టర్ ఒకే సామాజిక వర్గానికి చెందడం తో వీరిరువురు మధ్య ఒక అవగాహన కదిరి కాలేజీ పరిపాలన బాధ్యత అంతా కరస్పాండెంట్ షాడో కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్న ఫిజికల్ డైరెక్టర్ చేతి కి అప్పగించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ షాడో కరస్పాండెంట్ పెత్తనం చేపట్టాక కాలేజిలో విద్యార్థుల లో అధ్యాపకుల లో కుల విభక్షత చిచ్చు రేపారని సమాచారం. గత కరస్పాండెంట్ గా బాధ్యతలు నిర్వహించిన ఒకరు ఈ షాడో కరస్పాండెంట్ కి వేతనం నెలకు 20 వేలు మాత్రమే ఇచ్చేవారని ప్రస్తుత కరస్పాండెంట్ నాన్ మెడికల్ టీచింగ్ స్టాఫ్ గా విధులు నిర్వహిస్తు న్న ఈ షాడో కి నెలకు 40 నుండి 45 వేలు చెల్లిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

దీనితో ఈ షా డో కరస్పాండెంట్ కాలేజీ అసలైన కరస్పాండెంట్ ని తన చేతిలో రిమోట్ గా మల్చుకుని కాలేజిలో ఏ పని జరగాలన్నా ఈ షాడో కరస్పాండెంట్ కరుణా కటాక్షాలు తప్పని సరి అని అనుకుంటున్నారు. విద్యార్థుల పీజులు నిర్ణయం కూడా ఈ షాడో కరస్పాండెంట్ కనుసన్నలలో జరుగుతుందని సమాచారం.

ఇదే కాలేజిలో ఈ షాడో కరస్పాండెంట్ దళితులలో ఉన్న రెండు సామాజిక వర్గాలను విభజించి కుల వివక్ష చూపుతున్నట్టు ఈ కాలేజీలో పనిచేసే కొంత మంది అంతర్గతంగా విమర్శలు చేస్తున్నారని సమాచారం. ఇక్కడ చూపే కుల వివక్షత పై ప్రశ్నించే ధైర్యం ఎవరికి లేదని చెప్పుకుంటున్నారు.

ఎందుకంటే బయటకు చెప్పుకుంటే ఉన్న కొలువు ఊడిపోతుందేమో అనే భయం ప్రతి ఒక్కరినీ వెంటా డుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ కాలేజీ నుండి ఈ షాడో కరస్పాండెంట్ ని విధుల నుండి మిషనరీ యాజమాన్యం తప్పించక పోతే రానున్న కాలం లో ఈ కాలేజీ లో అడ్మిషన్ లు తగ్గే ప్రమాదం తో పాటు కాలేజీ పరువు ప్రతిష్టల కు కూడా భంగం కలిగే ప్రమాదం ఉందని చెప్పుకుంటున్నారు.

Related posts

సీఎం ప్రజావాణి లో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ చెంచులు

Satyam News

ఏపీ విద్యాశాఖ సూపర్‌…. లోకేష్‌పై కేంద్ర బృందం ప్రశంసలు

Satyam News

అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్న భారత్ కంపెనీలు

Satyam News

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన  కళా వైభవం

Satyam News

ఆర్టీసీ ఉద్యోగులకి ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Satyam News

గురుపూర్ణిమ సందేశం: వ్యాసో నారాయణో హరి

Satyam News

Leave a Comment