25.2 C
Hyderabad
September 20, 2026
జాతీయంహోమ్

రాసలీలల డీజీపీపై వేటు వేసిన ప్రభుత్వం

#KarnatakaDGP

తన కార్యాలయంలో ఓ మహిళతో అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు చూపే వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో, కర్ణాటక ప్రభుత్వం డీజీపీ (సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) కె. రామచంద్రన్ రావును తక్షణమే సస్పెండ్ చేసింది. పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ డిపార్ట్‌మెంట్ (DPAR) జారీ చేసిన వివరమైన సస్పెన్షన్ ఉత్తర్వుల్లో ఆయన కారెక్టర్ గురించి ప్రస్తావించారు.

పలు వార్తా ఛానళ్లలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో విస్తృతంగా ప్రసారమైన వీడియోలు, వార్తా కథనాల ఆధారంగానే ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. వీడియోల్లో కనిపించిన రామచంద్రన్ రావు ప్రవర్తన “అశ్లీల స్వభావం కలిగినది”గా ఉందని, ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగికి తగని చర్యగా, రాష్ట్ర ప్రభుత్వానికి అవమానాన్ని కలిగించిందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

ఈ అంశాన్ని పరిశీలించిన అనంతరం, రామచంద్రన్ రావు ప్రవర్తన ఆల్ ఇండియా సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1968లోని రూల్ 3 ఉల్లంఘనకు ప్రాథమికంగా సరిపోతుందని ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో, ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1969లోని రూల్ 3(1) ప్రకారం విచారణ పూర్తయ్యే వరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

సస్పెన్షన్ కాలంలో రామచంద్రన్ రావుకు నిబంధనల ప్రకారం జీవన భత్యం (సబ్సిస్టెన్స్ అలవెన్స్) చెల్లించబడుతుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు లిఖిత అనుమతి లేకుండా ప్రధాన కార్యాలయాన్ని విడిచిపెట్టరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ సస్పెన్షన్‌కు కారణమైన వీడియోల్లో, పోలీస్ యూనిఫాంలో ఉన్న రామచంద్రన్ రావు తన కార్యాలయంలో ఒక మహిళను ముద్దుపెట్టుకుంటున్నట్లు ఒక క్లిప్‌లో కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. మరో వీడియోలో భారత జెండా మరియు పోలీస్ శాఖ చిహ్నం ముందు కూడా ఇలాంటి ప్రవర్తన చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వీడియోల్లో మహిళ ముఖాన్ని బ్లర్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు క్యాప్షన్లతో సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

అయితే, ఈ వీడియోలను రామచంద్రన్ రావు పూర్తిగా ఖండించారు. ఇవన్నీ “కల్పితమైనవి, అసత్యమైనవి” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ, ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో హోంమంత్రి జీ. పరమేశ్వరతో తన వైఖరిని వివరించేందుకు డీజీపీ చేసిన ప్రయత్నం ఫలించలేదని సమాచారం. రామచంద్రన్ రావు బంగారు స్మగ్లింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న హర్షవర్ధిని రాణ్య అలియాస్ రాణ్య రావుకు స్టెప్‌ఫాదర్ కావడం విశేషం.

Related posts

తండ్రి చనిపోయిన రోజు…. కోల్‌కతాలో సూట్‌కేసులతో జగన్‌..??

Satyam News

తప్పుడు ప్రచారంపై వివరణ కోరిన ప్రభుత్వం

Satyam News

దర్శకుడు పీసీ ఆదిత్య కు ఛత్రపతి శివాజీ పురస్కారం…

Satyam News

పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి ఒక డ్రామా

Satyam News

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు

Satyam News

Leave a Comment