25.2 C
Hyderabad
September 20, 2026
మహబూబ్ నగర్హోమ్

వనపర్తి చైర్మన్ పదవి బీసీలకు ఇవ్వాలి: సతీష్

#Sateesh

వనపర్తి మున్సిపాలిటీలో బిసి అభ్యర్థులు మెజారిటీగా ఉన్నందుకు బిసి మహిళకు మునిసిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా  అధ్యక్షుడు డాక్టర్ సతీష్ యాదవ్ కోరారు. నిత్యం ప్రజల వెంట బీసీలు ఉండి సేవలు చేస్తున్నారని చెప్పారు.

వ్యాపారస్తులు, ధన బలం ఉన్న వారు ప్రజలకు సేవ ఎలా చేస్తారని ప్రశ్నించారు. వనపర్తి పట్టణంలో మేజర్ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఏర్పడిన నాటి నుండి బీసీలకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడం అనవాయితీగా వస్తుందని, అలాకాదని అగ్రవర్ణాలకు  ఇస్తే వనపర్తిలో బీసీలంతా ఏకమవుతారని హెచ్చరించారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

వనపర్తిలో మేజర్ గ్రామం పంచాయతీలో డాక్టర్ బాలకృష్ణయ్య, మున్సిపాలిటీ ఏర్పటు తరువాత లక్ష్మయ్యతో, డాక్టర్ అశ్విని దామోదర్,  గట్టు యాదవ్, మహేశ్ వరకు బీసీలకే మున్సిపల్ చైర్మన్ ఇవ్వడం  ఆనవాయితీగా మారిందనీ తెలిపారు. డబ్బులు రాజకీయంతో అగ్రవర్ణాలకు ఇస్తే బీసీ సంఘాలు వనపర్తి బీసీలు ఊరుకోరని అన్నారు.

గతంలో జనరల్ వచ్చినప్పుడు లోకనాథ్ రెడ్డినీ కాదని లక్ష్మయ్యకు చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. అదే పద్దతి కంటిన్యూ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బీసీలకు ఇవ్వకపోతే వనపర్తిలో ధర్నాలు, బందులకు పిలుపునిస్తామని చెప్పారు. బిసి కౌన్సిలర్లు అందరూ ఏకతాటిపై ఉండి బీ.సీ లకే చైర్మన్ ఇచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రామస్వామి, శివకుమార్, రమేష్, బాలరాజు  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

సంఘ్ శ‌తాబ్ది ఉత్స‌వ వేళ‌ గణవేష్ అభియాన్

Satyam News

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోండి

Satyam News

‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంఛ్: ఇష్టపడి చేస్తే నష్టమనేది ఉండదు

Satyam News

బీసీ నాయకుడి కాళ్లు విరగ్గొట్టిన వైసీపీ కార్యకర్తలు!

Satyam News

ఈడీ చేతిలో మద్యం కుంభకోణం కీలక ఆధారాలు

Satyam News

పాకిస్థాన్ నుండి స్మగ్లింగ్ అవుతున్న డ్రగ్స్

Satyam News

Leave a Comment