26.3 C
Hyderabad
September 19, 2026
కడపహోమ్

భారతి సిమెంట్స్‌ మోసం…. న్యాయం కోసం బాధితుల పోరు

#Jagan

నీతులు ఇతరులకు చెప్పడానికే ఉంటాయి. రూల్స్ బ్రేక్‌ చేయడానికే పెట్టారు.. అన్నట్లుంది.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని నల్లలింగాయపల్లి గ్రామస్తులు.. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ముందు భారీ నిరసన ప్రదర్శన చేశారు.

మాజీ సీఎం జగన్‌ కుటుంబానికి చెందిన సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు కోసం ఈ గ్రామస్తులు తమ భూములు త్యాగం చేశారు. కంపెనీ యాజమాన్యం మాత్రం గ్రామస్తులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. భూములు ఇచ్చినందుకు పూర్తి స్థాయిలో పరిహారమూ చెల్లించలేదు. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయింది.. సిమెంట్‌ ప్రొడక్షన్‌ జరుగుతోంది.. కంపెనీకి కోట్లలో లాభాలూ వస్తున్నాయి. కానీ భూములు ఇచ్చిన రైతులకు మాత్రం కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.

సిమెంట్‌ ఫ్యాక్టరీకి పొలాలు ఇచ్చే ప్రతి కుటుంబంలో ఒకరికి కంపెనీలో శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని భూసేకరణ సమయంలో హామీ ఇచ్చారు. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయ్యాక స్థానికులకు కాకుండా బయటి వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని నల్లలింగాయపల్లి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ భూముల్లో ఏర్పాటైన పరిశ్రమలో తమకే ఉపాధి లేకుండా పోయిందని.. పొలాలు కోల్పోయి, కనీసం కూలి పనులు చేసే అవకాశమూ లేక తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన గ్రామస్తులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

స్థానికుల నిరసనతో భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ మెయిన్‌ గేటు ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆందోళనకారుల డిమాండ్లను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. హామీలు నెరవేకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

అమరావతి రాజధాని భూసేకరణ దగ్గర్నుంచి.. గూగుల్‌ డేటా సెంటర్‌ భూముల వరకు వైసీపీ నేతలు నానా యాగీ చేస్తారు. కోర్టుల్లో కేసులు వేసి భూసేకరణ ప్రక్రియను అడ్డుకొంటారు. కానీ వాస్తవానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ కుటుంబానికి చెందిన కంపెనీ.. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందుకే అంటారేమో.. నీతులు చెప్పడానికి.. రూల్స్ మాట్లాడటానికే బాగుంటాయి కానీ పాటించడానికి కాదని.

Related posts

డిజిటల్ ఆధారాల విశ్లేషణలో పోలీస్ అకాడమీలో ఆధునిక శిక్షణ

Satyam News

నవమల్లెతీగ 100వ సంచికను ఆవిష్కరించిన మంత్రి సవిత

Satyam News

కేసీఆర్‌ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగం

Satyam News

కెనడా సరిహద్దు మీదుగా భారతీయుల అక్రమ రవాణా

Satyam News

టీటీడీ చైర్మన్ పై వైసీపీ డీప్ ఫేక్ ప్రచారం

Satyam News

ఎర్రగుంట్లలో రూ.2.52 కోట్లు పట్టివేత

Satyam News

Leave a Comment