25.2 C
Hyderabad
September 20, 2026
హైదరాబాద్హోమ్

టోలీ చౌకీ యువకుడి దారుణ హత్య

#crime

శంషాబాద్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో ఒక యువకుడు దారుణ హత్యకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మృతుడిని టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి అమీర్‌గా పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులు అమీర్‌ను ముందే హత్య చేసి ఇక్కడికి తీసుకువచ్చి తగలబెట్టారా, లేక సజీవ దహనం చేశారా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక ఆర్థిక లావాదేవీలు ఏమైనా కారణమా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts

విజయ్ కి గ్రీన్ సిగ్నల్: చిన్న పార్టీల మద్దతు

Satyam News

War effect: పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు

Satyam News

సర్వేల్లో వైసీపీ గ్రాఫ్‌ డౌన్‌…. ఆయనే మెయిన్‌ విలన్‌..??

Satyam News

మంత్రి నారాయణ విదేశీ పర్యటన

Satyam News

అమెరికా ఆయిల్ టాంకర్ పై ఇరాన్ దాడి?

Satyam News

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

Satyam News

Leave a Comment