26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

దేశ రాజధాని పేరు మారబోతున్నది….?

#Delhi

దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతున్నది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు కార్యరూపం దాలిస్తే భారత రాజధాని ఢిల్లీని ఇక నుంచి “ఇంద్రప్రస్థ”గా పిలవాల్సి వస్తుంది. ఢిల్లీ  పేరు మార్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వేగంగా పరిశీలిస్తోంది. మహాభారతంతో అనుబంధం ఉన్న చారిత్రక, పురాణ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ మార్పు ఉండాలని భావిస్తున్నారు.

ఈ ప్రతిపాదనను అధికారికంగా బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్ వాల్ ప్రారంభించారు. మహాభారత కాలంలో పాండవుల రాజధానిగా ప్రసిద్ధి చెందిన “ఇంద్రప్రస్థ” పేరుతో ప్రస్తుత రాజధానికి ప్రాచీన గుర్తింపును ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే నగరంలోని కొన్ని ముఖ్య ప్రదేశాల పేర్లను కూడా మార్పు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ చర్య ద్వారా ఆధునిక రాజధానిని తన ప్రాచీన మూలాలతో మళ్లీ అనుసంధానం చేయడం, దేశ సాంస్కృతిక గర్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఉందని ప్రతిపాదకులు పేర్కొంటున్నారు. సంప్రదాయ కథనాల ప్రకారం పాండవులు స్థాపించిన మొదటి నగరంగా “ఇంద్రప్రస్థ”ను పరిగణిస్తారు. “ఇంద్రప్రస్థ”నే ఢిల్లీకి తొలి పేరు అని పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఈ పేరు పునరుద్ధరణతో భారతీయ సంస్కృతి, వారసత్వానికి గౌరవం చాటవచ్చని అనుకూల వర్గాలు చెబుతున్నాయి.

పర్యాటక రంగానికి కూడా ఇది ఊతమిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే చరిత్రకారుల మధ్య ప్రాచీన ఇంద్రప్రస్థ నగరపు ఖచ్చిత స్థానం విషయంలో ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. పేరు మార్పుతో సంభవించే పరిపాలనా, ఆర్థిక, చారిత్రక ప్రభావాలపై కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలోనే ఉంది. తక్షణ నిర్ణయం తీసుకున్నట్లు లేదా అధికారికంగా అమలులోకి వచ్చినట్లు ఇంకా ప్రకటించలేదు.

Related posts

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

Satyam News

ఇంకొద్ది సేపటిలో 4రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Satyam News

అమెరికా డ్రీమ్స్ ఇక వదిలేయండి: మారిన రూల్సు ఇవే

Satyam News

భారత సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్

Satyam News

బూత్ లెవెల్ ఏజెంట్లతో మంత్రి దామోదర్ అవగాహన సమావేశం

Satyam News

అమరావతిలో హైటెక్‌ ఫిల్మ్‌ సిటీ….!!

Satyam News

Leave a Comment