26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

రూ.961 కోట్లకు చేరిన దురంధర్ 2 కలెక్షన్లు

#Durandhar2

భారతీయ సినీ పరిశ్రమలో మరో భారీ రికార్డు నమోదైంది. దురంధర్ 2 The Revenge బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతూ కేవలం 15 రోజుల్లోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా కొత్త చరిత్ర సృష్టించింది.

హిందీ భాషలో ప్రధానంగా విడుదలైన ఈ చిత్రం దక్షిణాది భాషల్లో కూడా మంచి స్పందన పొందింది. సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ వెర్షన్ల ద్వారా అదనంగా రూ. 61 కోట్ల వసూళ్లు రావడంతో మొత్తం కలెక్షన్లు రూ. 961 కోట్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే త్వరలోనే ఈ సినిమా రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటడం ఖాయం అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్యధర్, “ధురంధర్ 2” తో భారీ విజయాన్ని అందుకున్నారు. మొదటి భాగం కూడా భారీ వసూళ్లు సాధించగా, రెండో భాగం దానిని మించి మరింత పెద్ద స్థాయిలో విజయం సాధించడం విశేషం. మొదటి చిత్రం వసూళ్లు రూ. 896 కోట్లుగా నమోదయ్యాయి. అయితే “ది రివెంజ్” కేవలం 15 రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టడం గమనార్హం.

ప్రస్తుతం ఈ చిత్రం మొత్తం వసూళ్లు రూ. 1100 నుండి రూ. 1200 కోట్ల మధ్య ఉండే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రెండు భాగాల ద్వారా మొత్తం రూ. 2000 కోట్లకు పైగా వసూళ్లు సాధించేలా దర్శకుడు ఆదిత్య ధర్ భారీ స్థాయి విజయాన్ని నమోదు చేయనున్నారని అంచనా వేస్తున్నారు.

భారతీయ సినిమా చరిత్రలో ఒకే భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా “ధురంధర్ – ది రివెంజ్” నిలిచింది. ఈ విజయంతో భవిష్యత్ భారీ బడ్జెట్ సినిమాలకు కొత్త ప్రమాణాలు ఏర్పడినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమా విజయోత్సాహం మధ్య సినీ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఇంతటి వసూళ్లు సాధించడం భారతీయ సినిమాకు గర్వకారణంగా నిలుస్తోంది.

Related posts

ఎల్ నినో ప్రభావం తో ఈసారి కష్ట కాలమే

Satyam News

మరో మూడు రోజులు ఒక వైపు ఎండ మరొక వైపు వాన

Satyam News

హోర్ముజ్ జలసంధి లో ట్యాంకర్ల కు రక్షణ కల్పించలేదు

Satyam News

భగవంతుడితో పెట్టుకుంటే సర్వనాశనం తప్పదు

Satyam News

క్రిటికల్ మినరల్స్ పరిశోధనకు ‘త్రిముఖ’ భాగస్వామ్యం

Satyam News

కర్నూలు వ్యవసాయ మార్కెట్ నూతన పాలక మండలి

Satyam News

Leave a Comment