చిత్తూరుహోమ్

ఏపీ స్పేస్‌ సిటీలో.. రాకెట్ ఇంజన్‌ టెస్టింగ్‌ సెంటర్..

#ChandrababuNaidu

ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడూ 20 ఏళ్లు అడ్వాన్స్‌గా ఆలోచిస్తారు. ఆ విజన్‌ అందరికీ అర్ధం కాదు. ఆయన ఐటీ అంటే కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు. అప్పుడు విమర్శించిన వాళ్లంతా ఇప్పుడు ఆ ఐటీ మీదే ఆధారపడుతున్నారు.

చంద్రబాబు దార్శనికతను అర్దం చేసుకోలేక.. ఇది జరిగే పనేనా అని అనుమానంగా చూసిన మరో ప్రాజెక్టు ఏపీ స్పేస్‌ సిటీ. రాష్ట్రంలో రాకెట్‌ టెక్నాలజీ అభివృద్ధి కోసం తిరుపతి సమీపంలో నిర్మిస్తున్న స్పేస్‌ సిటీలో ల్యాండ్‌ అయిన ప్రాజెక్టుతో ప్రపంచమే ఏపీ వైపు తిరిగి చూసే పరిస్థితి వచ్చింది. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఆస్ట్రో బేస్ టెక్నాజీస్ సంస్థ… ఏపీ స్పేస్‌ సిటీలో రాకెట్‌ ఇంజన్‌ టెస్టింగ్‌ ఫెసిలిటీ నిర్మిస్తోంది.

ఇది దేశంలోనే మొదటి  మొదటి ప్రైవేట్‌ క్రయోజనిక్ ఇంజన్‌ టెస్టింగ్‌ సెంటర్. ఈ సంవత్సరమే  ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 200 టన్నుల… హై థ్రస్ట్‌… టెస్ట్‌ స్టాండ్‌ని నిర్మిస్తున్నారు. ఈ టెస్ట్ స్టాండ్ ద్వారా 2 వేల కిలో న్యూటన్ల బలంతో పుష్‌ చేసే రాకెట్ ఇంజన్లను పరీక్షించవచ్చు. ముందుగా 80 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌ – లిక్విడ్‌ మీథేన్‌.. ఫుల్ ఫ్లో స్టేజ్డ్‌ కంబస్ఛన్ ఇంజన్‌ని పరీక్షిస్తారు.

ఎలాన్‌ మస్క్‌ స్పేస్‌ ఎక్స్ తయారు చేసే స్పేస్ ఎక్స్ ర్యాప్టర్‌ ఇంజన్ల మాదిరిగా.. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తయారు చేసే ఆస్ట్రోబేస్‌ ఇంజన్లను రీయూజబుల్‌ రాకెట్లలో వినియోగించవచ్చు. వీటి ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటి వరకు ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఇస్రో దగ్గర కూడా ఇలాంటి అడ్వాన్స్‌ రాకెట్‌ ఇంజన్‌ టెక్నాలజీ లేదు. ఏపీ స్పేస్‌ సెంటర్‌లో ఏర్పాటవుతున్న రాకెట్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ప్రైవేటు రంగంలో మొదటి సంస్థ అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యూచర్‌ టెక్నాలజీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. సీఎం చంద్రబాబు దార్శనికతతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన విజన్‌తోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో క్వాంటం వ్యాలీ, తిరుపతి సమీపంలో స్పేస్‌ సిటీ ఏర్పాటవుతున్నాయి. డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటర్ల దగ్గరే ఆగిపోకుండా.. స్పేస్ టెక్నాలజీలోనూ ఆంధ్రప్రదేశ్‌ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.

Related posts

దళపతి విజయ్ కు కాంగ్రెస్ మద్దతు

Satyam News

మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Satyam News

ట్రిలియన్ డాలర్ ఎకానమీగా విశాఖ

Satyam News

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర కన్నుమూత

Satyam News

బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

Satyam News

తిరుమల నుంచి అన్యమతస్తులు ఔట్‌…!

Satyam News

Leave a Comment