సినిమాహోమ్

సినీ దర్శకుడు పి సి ఆదిత్య కు దాదా ఫాల్కే గౌరవ పురస్కారం

#PCAditya

విలక్షణ దర్శకుడు నిత్య ప్రయోగశీలి డాక్టర్ పిసి ఆదిత్యను మరొక ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే 156వ జయంతి సందర్భంగా ఢిల్లీకి చెందిన గ్రీన్ పరివార్ ఇండియా ఫౌండేషన్ వారు అందజేసిన ప్రతిష్టాత్మక దాదా ఫాల్కే గౌరవ పురస్కారాలలో భాగంగా తెలుగు సినీ రంగానికి చెందిన సినీ శ్రామికుడు డాక్టర్ పి సి ఆదిత్య కు దాదాసాహెల్కే గౌరవ పురస్కారం అందజేశారు.

ఈ సందర్భంగా సంస్థ అధినేత నీరజ్ గుప్త మాట్లాడుతూ దక్షిణ భారత సినీ రంగంలో గత 30 ఏళ్లుగా అలుపెరుగని ప్రయోగాలతో ప్రయాణం చేస్తున్న విలక్షణ దర్శకుడు డాక్టర్ పీసీ ఆదిత్యను దాదా ఫాల్కే గౌరవ పురస్కారం అందచేయడం గర్వంగా ఉందన్నారు… తన 30 సంవత్సరాల సినీ సేవలో ఆదిత్య ఎంతోమంది నూతన నటీనటులను  సాంకేతిక నిపుణులను సినీ రంగానికి పరిచయం చేశారు. ఆదిత్య ప్రోత్సహిస్తూ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ఇచ్చాము అని వివరించారు.

దాదా ఫాల్కే గౌరవ పురస్కార గ్రహీత డాక్టర్ పి సి ఆదిత్య స్పందిస్తూ ప్రపంచ సినిమా గర్వించదగ్గ భారతీయ చలనచిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే స్మారక పురస్కారం అందుకోవడం తనకు మరింత స్ఫూర్తినిచ్చిందని భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు సందేశాత్మక సినిమాలు రూపొందించి ఎప్పటి లాగానే నూతన కళాకారులకు సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Related posts

ఐఐఐటీ జంక్షన్ – డీఎల్‌ఎఫ్ కారిడార్ రహదారి అభివృద్ధి

Satyam News

ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్

Satyam News

ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో భారీ అవినీతి

Satyam News

కలకలం సృష్టిస్తున్న డబుల్ మర్డర్ కేసు

Satyam News

మహిళల అక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు

Satyam News

గాంధీని, పొట్టి శ్రీరాములును మరచిన ఆర్యవైశ్య నేతలు

Satyam News

Leave a Comment