26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ఏర్పాటుకు శ్రీకారం

#SridharBabu

హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు మరో పెద్ద ఊతం లభించింది. జర్మనీకి చెందిన ప్రముఖ రసాయన దిగ్గజం BASF “BASF గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్” పేరిట గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

ఈ గ్లోబల్ సర్వీస్ హబ్ ద్వారా సంస్థ తన గ్లోబల్ సర్వీస్ డెలివరీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఫైనాన్స్, హెచ్ఆర్ సర్వీసెస్, ఇతర వ్యూహాత్మక కార్యకలాపాలకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేయనుంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థ నిర్వహిస్తున్న సేవలకు ఇది కీలక కేంద్రంగా మారనుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

హైదరాబాద్‌లోని Taj Krishna హోటల్‌లో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్లోబల్ సర్వీస్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI)ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు BASF ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తోందని, అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా ఎంపిక చేసుకుంటున్నాయని మంత్రి పేర్కొన్నారు.

160 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన BASF సంస్థ ప్రపంచ వ్యాప్తంగా కెమికల్స్, మెటీరియల్స్, ఇండస్ట్రియల్ సొల్యూషన్స్, సర్ఫేస్ టెక్నాలజీస్, న్యూట్రిషన్ & కేర్, అగ్రికల్చరల్ సొల్యూషన్స్ వంటి విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రస్తుతం 200కు పైగా దేశాల్లో తన సేవలను విస్తరించిన ఈ సంస్థ, హైదరాబాద్‌ను గ్లోబల్ ఆపరేషన్స్‌కు ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా నగరానికి ఐటీ, సేవల రంగాల్లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముండగా, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభించనున్నాయి. తెలంగాణను గ్లోబల్ బిజినెస్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు.

Related posts

21వ శతాబ్దంలో మానవవాదం పుస్తకావిష్కరణ

Satyam News

నవంబరు 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

Satyam News

నిరుద్యోలను మోసం చేసిన కాంగ్రెస్

Satyam News

భారత్ సముద్ర తీరం వద్దకు వచ్చిన ‘యుద్ధం’

Satyam News

రామరాజ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

టెహ్రాన్ కు చేరిన రష్యా కార్గో విమానం

Satyam News

Leave a Comment