జాతీయంహోమ్

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

#MamataBenarji

మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2026 మే 7 నుంచి పశ్చిమ బెంగాల్ శాసనసభ రద్దు అయినట్లు గవర్నర్ ప్రకటన వెలువడింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేచింది.

గవర్నర్ ఉత్తర్వులతో ప్రస్తుతం శాసనసభ అధికారికంగా రద్దు కావడంతో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కానుంది. అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనగా పార్టీ లేదా సంబంధిత కూటమిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. అవసరమైతే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించే దిశగా కూడా చర్యలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం అత్యంత కీలకంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పటికే రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొంది. ప్రధాన పార్టీల నేతలు తమ వ్యూహాలను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం.

ఇక ప్రజల్లో కూడా కొత్త ప్రభుత్వం ఎలా ఉండబోతోంది? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? రాష్ట్ర రాజకీయ భవిష్యత్ దిశ ఏవైపు వెళ్లనుంది? అన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. గవర్నర్ నిర్ణయంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత ఆసక్తికర మలుపు తిరిగాయి.

Related posts

ఫార్మా సిటీ భూములు వెనక్కు తిరిగి ఇవ్వాలి

Satyam News

తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: మంత్రి ఉత్తమ్‌

Satyam News

జనం మెచ్చిన వారికే టికెట్లు..!

Satyam News

పెళ్లైన నెలకే దంపతుల ఆత్మహత్య

Satyam News

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Satyam News

సేవా తత్వాన్ని సహించలేనిది ప్రత్యర్థి పార్టీ నాయకులా?

Satyam News

Leave a Comment