26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

ఇరాన్ కు మళ్లీ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్

#DonaldTrump

ఇరాన్ తో ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు మరో సారి నోరుపారేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై ఈసారి మళ్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణు ఒప్పందంపై చర్చలను అనవసరంగా ఆలస్యం చేస్తోందని, ఆ ఆలస్యానికి ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

బుధవారం తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ లో స్పందించిన ట్రంప్, ఇరాన్‌తో కుదిరే ఒప్పందం వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని, అయితే చర్చలను చాలా కాలం పాటు లాగడం వల్ల ఇప్పుడు పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.

“వారికి ఎంతో మేలు చేసే ఒప్పందంపై చర్చలు జరపడానికి చాలా ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇప్పుడు వారు దాని మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అని ట్రంప్ తన పోస్టులో వ్యాఖ్యానించారు.

అయితే ట్రంప్ చేసిన “మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అనే వ్యాఖ్యకు సంబంధించిన స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. దీనివల్ల అమెరికా నుంచి మరిన్ని ఆర్థిక ఆంక్షలు ఉంటాయా, లేక సైనిక లేదా దౌత్యపరమైన చర్యలు తీసుకుంటారా అనే అంశంపై స్పష్టత రాలేదు.

ఇదిలా ఉండగా, బుధవారం అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. రెండు దేశాల మధ్య పరస్పర దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకున్న నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు చేయడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

అమెరికా-ఇరాన్ సంబంధాలు ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రత, మధ్యప్రాచ్య పరిణామాలు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు కొనసాగుతుండగా, తాజా వ్యాఖ్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

సింగూరు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న మంత్రి బామ్మర్ది

Satyam News

రాష్ట్ర బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజ

Satyam News

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

Satyam News

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

Satyam News

అధికారంలో ఉంటే రెడ్లు లేక పోతే కాపులు..

Satyam News

శాంతి భద్రతలే పెట్టుబడులకు పునాది

Satyam News

Leave a Comment