తూర్పుగోదావరిహోమ్

గోదావరి డెల్టాకు అన్యాయం చేసిన జగన్ రెడ్డి

#DhavaleswaramBarriage

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ధవళేశ్వరం బ్యారేజ్ గేట్ల పునర్నిర్మాణంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమగ్ర వివరణ ఇచ్చారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సుమారు 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ, లక్షలాది మంది ప్రజలకు తాగునీరు మరియు పారిశ్రామిక అవసరాలు తీర్చే ప్రధాన వనరుగా ధవళేశ్వరం బ్యారేజ్ నిలుస్తోందని తెలిపారు. గోదావరి డెల్టా వ్యవస్ధకు ఇది గుండెవంటిదని మంత్రి పేర్కొన్నారు.

2014లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం గోదావరి డెల్టా ఆధునీకరణలో భాగంగా రూ.31.77 కోట్లతో 175 గేట్లలో 58 కొత్త గేట్లు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. అలాగే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మిగిలిన 117 గేట్ల మార్పిడి కోసం రూ.150.09 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

బ్యారేజ్ ప్రమాదంలో ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) హెచ్చరించినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నాడు బ్యారేజ్‌కు నిధులు కేటాయించిన చంద్రబాబే, ఇప్పుడు కూడా ధవళేశ్వరం బ్యారేజ్‌కు కొత్త గేట్ల ఏర్పాటుకు రూ.150 కోట్లు మంజూరు చేశారని మంత్రి తెలిపారు.

గోదావరి డెల్టా కాలువల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా, సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టాప్ లాగ్ గేట్లను వినియోగిస్తూ దశలవారీగా పనులు చేపడతామని స్పష్టం చేశారు. అదేవిధంగా గోదావరి డెల్టాలో ముంపు సమస్యల పరిష్కారం, లాకులు, గేట్ల మరమ్మత్తుల కోసం సమగ్ర డిపిఆర్ తయారుచేయడానికి, లైడార్ సర్వే నిర్వహణకు రూ.13.4 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం ఏరియల్ లైడార్ సర్వే కొనసాగుతోందని మంత్రి తెలిపారు.

Related posts

బ్యాంకు రుణాలు సకాలంలో అందాలి

Satyam News

గంజాయి సాగు ఆపడానికి ఇక పల్లెల్లో ఈగల్

Satyam News

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

Satyam News

బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..

Satyam News

వరాలనిచ్చే అమ్మవారి ఆరాధనకు విశిష్ట ప్రాధాన్యం

Satyam News

Leave a Comment