ప్రత్యేకంహోమ్

ఏడుకొండలపై నాడు కుట్ర….. YSR అరాచక చరిత్ర ఇదే.!

#Tirumala

తిరుమల పవిత్రతను కాపాడింది తామేనంటూ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అసత్య ప్రచారంపై భక్తులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఏడుకొండల అస్తిత్వాన్నే దెబ్బతీయాలని చూసిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని గుర్తు చేస్తున్నారు భక్తులు.

పరమ పవిత్రమైన ఏడుకొండలను కేవలం రెండు కొండలకే (27.5 చ.కి.మీ) పరిమితం చేస్తూ జీవో నెం. 338 తెచ్చిన ఘనత వైఎస్సార్‌ది కాదా.? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన 5 కొండలను ప్రభుత్వపరం చేసి ఇతర కార్యకలాపాలకు వాడాలని చూస్తే, భక్తులు రోడ్డెక్కి పోరాడటంతో హైకోర్టు చివాట్లు పెట్టి అడ్డుకున్న విషయాన్ని సైతం గుర్తు చేస్తూ కౌంటర్ ఇస్తున్నారు.

హిందూ దేవాలయాల పట్ల నాటి వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం వివక్షతో వ్యవహరించిందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. GO నెం. 21 ద్వారా చర్చిల మరమ్మతులకు, కొత్త చర్చిల నిర్మాణాలకు ప్రభుత్వ నిధులు ధారాళంగా కేటాయించిన YSR, అదే సమయంలో 7000 ఎకరాల దేవాలయ భూములను అమ్మేసి రూ.20 వేల కోట్లు రాబట్టాలని స్కెచ్ వేశారని గుర్తు చేస్తున్నారు…

ఈ క్రమంలోనే అనేక ప్రాంతాల్లో ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, క్రైస్తవ మిషనరీల ఆగడాలకు ఆనాటి పెద్దాయన ప్రభుత్వం అండగా నిలిచిందని భక్తులు మండిపడుతున్నారు.

నాడు TTDలో ధర్మారెడ్డి లాంటి అధికారులు ఉన్న సమయంలో కొండపై క్రైస్తవ ప్రచారం పతాక స్థాయికి చేరిందని, పాస్టర్లు తిరుమల గిరులపై స్వైరవిహారం చేశారని హిందూ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా పేజావర్ మఠాధిపతి విశ్వేశ్వర తీర్థ స్వామి, స్వరూపానంద స్వామి వంటి వారు రోడ్డెక్కి పోరాడాల్సిన దుస్థితిని కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

లక్ష్మీనరసింహ స్వామి భూముల విక్రయం, టీటీడీ కాంట్రాక్టులను JRGవెల్త్ వంటి అనుయాయులకు కట్టబెట్టడం లాంటి అపచారాలు YSR హయాంలో నిత్యకృత్యమయ్యాయని గుర్తు చేస్తున్నారు.

బ్రదర్ అనిల్ నుంచి బెన్నీ హిన్ సభల దాకా హిందూ ధర్మాన్ని కించపరిచేలా సాగిన ప్రస్థానాన్ని హిందువులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇప్పుడు 746, 747 జీవోల పేరుతో వైసీపీ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నా, భక్తుల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

దేవుడితో ఆటలాడితే ఫలితం ఎలా ఉంటుందో చరిత్ర నిరూపించిందని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని నెటిజన్లు, హిందూ సంఘాలు వైసీపీకి హితవు పలుకుతున్నాయి.

Related posts

కేంద్ర కేబినెట్ విస్తరణ కు ముహూర్తం ఖరారు

Satyam News

అమెరికా ఇరాన్ మధ్య చర్చలు జరుగుతాయా?

Satyam News

లైంగిక వ్యాధులతో బిల్ గేట్స్… నిజామా?

Satyam News

10 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల భర్తీ

Satyam News

విద్యార్థుల హాస్టళ్లకు త్వ‌ర‌లో 2.55 ల‌క్ష‌ల దోమ తెర‌లు

Satyam News

లక్ష్యం సాధించే వరకు దాడులు ఆగవు

Satyam News

Leave a Comment