30.3 C
Hyderabad
September 23, 2026
ముఖ్యంశాలుహోమ్

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

#SocialMedia

నీట్ విద్యార్ధుల పేరుతో కాక్రోచ్ పార్టీ నిర్వహించిన జంతర్ మంతర్ ధర్నాలో దేశ వ్యతిరేక వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని సోషల్ మీడియా సంస్థలుగా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ప్రకారం పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న 400కు పైగా సామాజిక మాధ్యమ ఖాతాలను గుర్తించి నిలిపివేశారు. ఇవి కాక్రోచ్ పార్టీతో సమన్వయం చేసుకుంటూ తప్పుడు సమాచారం, దుష్ప్రచారం వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఖాతాల ద్వారా ముఖ్యంగా దేశ భద్రత, శాంతిభద్రతలు, ప్రజా పరిస్థితులకు సంబంధించిన అసత్య ప్రచారాలను విస్తృతంగా వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో గందరగోళం సృష్టించడం, ప్రజల్లో అపోహలు పెంచడం లక్ష్యంగా ఈ విదేశీ ఖాతాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువత ప్రత్యేక అప్రమత్తత పాటించాలని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. విదేశీ ఖాతాల నుంచి వచ్చే అసత్య సమాచారం, పుకార్లు, రెచ్చగొట్టే పోస్టులను నమ్మకుండా అధికారిక వనరుల ద్వారా మాత్రమే సమాచారాన్ని ధృవీకరించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో కనిపించే ప్రతి సమాచారాన్ని పరిశీలించకుండా పంచుకోవద్దని, తప్పుడు ప్రచారాలకు సహకరించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Related posts

ఇక నుంచి రెగ్యులర్గా వస్తా.ఊరికి చేసేది చాలా ఉంది

Satyam News

శత్రువుకు కూడా సాయం చేసిన లోకేష్‌

Satyam News

విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద దాడి కేసులో 7గురి అరెస్టు

Satyam News

వైసీపీ కేతిరెడ్డి భూ ఆక్రమణ: ఇద్దరి సస్పెన్షన్

Satyam News

సీనియర్ జర్నలిస్ట్ కనకంటి భూమయ్యకు పరామర్శ

Satyam News

20 నోటిఫికేషన్లు.. లక్ష జాబ్స్.. ఉగాదికి ఏపీలో ఉద్యోగాల జాతర

Satyam News

Leave a Comment