25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

వైసీపీకి గుడ్‌ బై…ఆ పార్టీలోకి విడదల రజిని జంప్‌….!!

వైసీపీ నేత, మాజీ మంత్రి విడదల రజని పార్టీ మారడానికి రెడీ అవుతున్నారా?? ఆమె వైసీపీకి గుడ్‌ బై చెబుతున్నారా.?? ఆమె మరో పార్టీలోకి జంప్‌ చేయనున్నారా.?? అంటే అవుననే చెబుతున్నాయి తాజా లీకులు.. ఈ రాజకీయల లీకులను స్వయానా మీడియాకి ఇచ్చింది ఆవిడ అనుచరులే అని తెలుస్తోంది.. ఇంతకీ ఆమె ఎందుకు పార్టీ మారబోతున్నారో తెలిస్తే షాక్‌ అవుతారు…

ఇటీవలి ఎన్నికలలో ఆమె గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు.. గతంలో చిలకలూరిపేట స్థానం నుండి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన రజనీకి షాక్‌ ఇచ్చాడు జగన్‌.. ఆమెని గుంటూరు వెస్ట్ నుండి బరిలో నిలిపారు.. అక్కడ ఆమె దారుణంగా పరాజయం చెందారు.. ఫలితాల షాక్‌ నుండి కోలుకున్న రజని, వెంటనే జగన్‌తో చర్చించి మళ్లీ చిలకలూరిపేట నుండి బరిలోకి దిగడానికి సన్నద్ధం చేసుకున్నారు.. తన కార్యక్షేత్రంగా పేటను ఎందచుకున్నారు రజని..

తాజాగా ఆమెకి పార్టీ హైకమాండ్‌ నుండి ఊహించని సందేశం అందింది.. రజని.. చిలకలూరిపేటని ఖాళీ చేసి రేపల్లె నుండి రంగంలోకి దిగేలా ప్లాన్‌ చేసుకోవాలని, అక్కడినుండే 2029లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉండాలని ఆదేశించారు సజ్జల.. రేపల్లెలో హ్యాట్రిక్‌ విజయాలతో దూకుడు మీదున్న మంత్రి అనగాని సత్యప్రసాద్‌ని ఓడించాలంటే రజనియే సరైన ప్రత్యర్ది అని భావించాడట జగన్‌.. చిలకలూరి పేట టు గుంటూరు వెస్ట్‌.. తాజాగా రేపల్లెకి షిఫ్ట్ చేయడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారట.. చిలకలూరి పేటని వీడడానికి ఇష్టపడని ఆమె పార్టీ మారేందుకే సన్నాహాలు చేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.. ఆమె ఏ పార్టీ కండువా కప్పుకుంటారో తెలియదు కానీ, వైసీపీకి గుడ్‌ బై చెప్పడానికి రెడీ అయినట్లు లీకులు వస్తున్నాయి.. వీటిని స్వయంగా ఆవిడ టీమ్‌ చేస్తోందని మీడియాలో ప్రచారం జరుగుతోంది..

జగన్‌ తలా తోకా లేని నిర్ణయాలు, తన రాజకీయ జీవితంతో ఫుట్‌ బాల్‌ ఆడుకుంటున్నారని భావించిన రజని.. ఈ నిర్ణయానికి వచ్చిందని సమాచారం.. మరి, పార్టీ హై కమాండ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

Related posts

క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు

Satyam News

భయం… భయంగా తిరుగుతున్న జగన్ బాబాయ్!

Satyam News

ఐబొమ్మ రవికి బెయిల్: నెక్ట్స్ ఏంటీ?

Satyam News

విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత

Satyam News

తిరుమలలో ఉచిత బస్సుల సంఖ్య పెంపు

Satyam News

రోజా కు బిగుసుకుంటున్న అవినీతి ఉచ్చు

Satyam News

Leave a Comment