26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

నేడు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్

#NaraLokesh

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అమరావతిలో జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన హస్తినకు బయలుదేరుతారు.

షెడ్యూల్ ప్రకారం, నేడు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ నుండి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు.

రేపు ఉదయం పార్లమెంట్ భవనానికి వెళ్లనున్న ఆయన, అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన ప్రాజెక్టుల పురోగతిపై వారితో చర్చించే అవకాశం ఉంది.

తన పర్యటన ముగించుకుని రేపు అర్ధరాత్రికి లోకేష్ తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

Related posts

బందరు పోర్టు కు ఇప్పుడు ‘చంద్ర’ కళ

Satyam News

భీమడోలు పంచాయతీలో భారీ అవినీతి

Satyam News

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

Satyam News

ఘనంగా వట్పల్లి హజ్రత్ దర్గా షరీఫ్ ఆరాధన

Satyam News

కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన భారత్

Satyam News

No Sleep: నిద్ర పై ఎల్ ని నో తీవ్ర ప్రభావం

Satyam News

Leave a Comment