మెదక్హోమ్

‘మన ఊరు–మన బడి’ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి

#HarishRao

గత రెండున్నరేళ్లుగా బిల్లులు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ‘మన ఊరు–మన బడి’ సివిల్ కాంట్రాక్టర్లు బీఆర్‌ఎస్ పార్టీ నేత టీ.హరీష్ రావును కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో పేద విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు సమయానికి చెల్లించామని తెలిపారు.

అయితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1500 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఆరోపించారు. అప్పులు తీసుకుని పనులు పూర్తి చేసిన చిన్న కాంట్రాక్టర్లు ఇప్పుడు మిత్తీలు కూడా కట్టలేని పరిస్థితిలో రోడ్డున పడుతున్నారని పేర్కొన్నారు. అప్పుల బాధతో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని అన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు నిధులు లేవని చెప్పే ప్రభుత్వం, పెయింటింగ్ మరియు బెంచీల సరఫరా చేసిన పెద్ద కంపెనీలకు మాత్రం వందల కోట్లు విడుదల చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు.

ప్రజావాణిలో వినతిపత్రాలు ఇచ్చినా, విద్యాశాఖ అధికారులను కలిసినా స్పందన లేకపోయిందన్నారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసినా పరిష్కారం దొరకలేదని తెలిపారు. చివరకు సచివాలయంలో ఆర్థిక మంత్రి కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలపగా, కాంట్రాక్టర్లపై అక్రమ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యంపై శాసన మండలి చైర్మన్ మండలిలోనే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిపారు. బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు ఆగిపోయి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు కేటాయించిన నిధులను చిన్న కాంట్రాక్టర్లకు విడుదల చేసి, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, కాంట్రాక్టర్లపై నమోదైన కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని కోరారు.

Related posts

జాతీయ మీడియాలో లోకేష్‌పై సంచలన కథనాలు

Satyam News

శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనండి

Satyam News

తిరుపతి మిస్సింగ్: గుంటూరు జిల్లాలో కనిపించిన మృతదేహం

Satyam News

కృష్ణా జలాల విషయం పట్టించుకోని సీఎం

Satyam News

ఇరాన్ ప్రతీకారం: మండిపోతున్న గల్ఫ్ దేశాలు

Satyam News

తప్పుడు మాటలతో తికమక జగన్

Satyam News

Leave a Comment