25.2 C
Hyderabad
September 20, 2026
కర్నూలుహోమ్

ఎమ్మిగనూరు లో ఘనంగా మహిళా దినోత్సవం

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

మహిళల ఆత్మగౌరవం, అచంచల సంకల్పం, సమాజ అభివృద్ధిలో వారి కీలక పాత్రను గుర్తిస్తూ వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు. యువ విద్యార్థినులతో పరస్పర సంభాషణ, వివిధ రంగాల్లో వారి ప్రతిభను చాటిన మహిళాలకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శాలువా కప్పి, పూల మాలతో సత్కరించారు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

మహిళల సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన మరియు సురక్షితమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి స్పష్టమైంది అని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్నీ కార్పొరషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మిగనూరు ఎంపీడీవో, మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళలు పాల్గొన్నారు. వడ్డే కృష్ణ 29వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కూడా పాల్గొన్నారు.

Related posts

మాట నిలబెట్టుకున్న లోకేష్…. పేద ముస్లిం ఫ్యామిలీకి రంజాన్‌ కానుక…!!

Satyam News

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

Satyam News

ఏఐలో దేశంలోనే ఏపీ టాప్‌…. లోకేష్‌కి కేంద్ర మంత్రి కితాబు

Satyam News

‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ వ్యవస్థప్రారంభం

Satyam News

31న విడుదలకు సిద్ధమౌతున్న “అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి”

Satyam News

జగన్ పార్టీ‌పై ‘సునీత’ అస్త్రం

Satyam News

Leave a Comment