26.3 C
Hyderabad
September 19, 2026
జాతీయంహోమ్

‘నా పై ఆరోపణలు చేయడం కరెక్టు కాదు: ఓంబిర్లా

OMBirla

సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆవేదనతో కూడిన సమాధానం ఇచ్చారు. తాను ఎన్నడూ అలా చేయలేదని స్పష్టం చేశారు. తనపై అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ విపక్షం గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం బతికి ఉంటుందనే విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు. సభను నియమ నిబంధనలకు అనుగుణంగా నడిపించడం తన బాధ్యత అని స్పష్టం చేశారు.

సభలో ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇవ్వడానికి స్పీకర్‌గా తాను ఎప్పుడూ కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇటీవల సభలో జరిగిన అవిశ్వాస తీర్మానంపై చర్చను ఉదాహరణగా చూపుతూ, ఆ అంశంపై 12 గంటలకు పైగా చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఆ చర్చలో విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను విస్తృతంగా వ్యక్తం చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ఎంతో ముఖ్యమని, విపక్షాలు మాట్లాడినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన భారత పార్లమెంట్ ప్రాముఖ్యతను కూడా వివరించారు. ఈ సభ 140 కోట్ల భారతీయుల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిబింబమని తెలిపారు. దేశ ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకొని పంపిన ఈ సభలో అన్ని వర్గాల అభిప్రాయాలు వినిపించడం ప్రజాస్వామ్య బలం అని అన్నారు. సభలో సభ్యులు సభా నియమాలను పాటిస్తూ చర్చల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.

నియమాలకు కట్టుబడి చర్చలు జరిగితేనే ప్రజల సమస్యలు సక్రమంగా ప్రతిబింబిస్తాయని చెప్పారు. స్పీకర్‌గా తాను ఎప్పుడూ సమానత్వంతో వ్యవహరిస్తానని, ప్రభుత్వం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Related posts

ఖమ్మం నగర శివారులో భారీ ఆపరేషన్

Satyam News

మర్డర్ కు దారితీసిన క్రికెట్ మ్యాచ్

Satyam News

కడపలో అర్ధరాత్రి దారుణం: ఇల్లు నేలమట్టం

Satyam News

ఇరాన్ పై దాడి: 165 మంది బాలికలు మృతి?

Satyam News

ప్రపంచస్థాయి సాంకేతికతతో విపత్తు రక్షణ వ్యవస్థ బలోపేతం

Satyam News

పరకామణి చోరీ కేసు… ఏ క్షణమైనా భూమన అరెస్ట్‌..!!

Satyam News

Leave a Comment