23.9 C
Hyderabad
September 27, 2026
హైదరాబాద్హోమ్

రంజాన్ సందర్భంగా రేవంత్ ఇఫ్తార్ విందు

అన్ని మతాలకు చెందినవారు కలిసికట్టుగా సోదరభావంతో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించుకుందామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రంజాన్ ఇఫ్తార్ విందు సందర్భంగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనారిటీల అభ్యున్నతికి సాధ్యమైనంత మేరకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మైనారిటీ సంక్షేమ శాఖ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. “రంజాన్ మాసం ఒక పండుగ మాత్రమే కాదు. విలువలను గుర్తుచేసే పవిత్ర మాసం. నెల రోజులపాటు ఆత్మశుద్ధితో పరులకు సహకారం అందిస్తూ అందరితో సత్సంబంధాలను కొనసాగించడమే రంజాన్ మాసం పవిత్రత” అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

“రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి పదవి, షబ్బీర్ అలీ కి సలహాదారుగా, క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌‌కు, బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీగా ఉద్యోగ కల్పించడమే కాకుండా 2 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించాం. 8 మంది మైనారిటీ నాయకులను వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించాం అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

ఈ రంజాన్ పండుగ ప్రజల్లో సఖ్యత, సోదరభావం తీసుకొచ్చి హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ మత సామరస్యంతో రాష్ట్ర అభివృద్ధి ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. ప్రతి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీలకు సింహ భాగమిచ్చి ముందుకు నడిపిస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లలో మైనారిటీలకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు.

“ఈ ప్రభుత్వం మనందరిదీ. నేను మీ సోదరుడిని. మనమందరం కలిసి తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరం కలిసి కష్టపడితేనే ఈ రాష్ట్రం, దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో మీ అందరి సహకారం కావాలి” అని కోరారు.

Related posts

ఫైబర్ నెట్ విస్తృత పరిచేందుకు పటిష్ట ప్రణాళిక

Satyam News

వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసిన గత వైసిపి ప్రభుత్వం

Satyam News

మోహన్ భాగవత్ పై కాంగ్రెస్ ఘాటు విమర్శ

Satyam News

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నాం

Satyam News

దర్శకుడు పిసి ఆదిత్య కు దాసరి నారాయణరావు స్మారక పురస్కారం

Satyam News

ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను రక్షించండి

Satyam News

Leave a Comment