25.7 C
Hyderabad
September 24, 2026
గుంటూరుహోమ్

మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్..

#Prajadarbar

మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు.

ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్ లో కాలం తీరిన బాక్స్ లకు 59 రూపాయల రెంటల్ ను తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

సమస్యను సంబంధిత మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి లోకేష్ వారికి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో తన 0.81 ఎకరాల భూమిని ఆన్ లైన్ లో నమోదుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన ముత్తే సాంబశివరావు కోరారు.

రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలని ఏలూరుకు చెందిన నిమ్మల జ్యోతి కుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

విజయవాడ మొగల్రాజపురంలోని తమ ఖాళీ స్థలానికి సంబంధించి వేరొక వ్యక్తి పేరుపై అక్రమంగా ఇంటి పన్ను విధించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు సదరు పన్నును రద్దుచేసి న్యాయం చేయాలని గూడపాటి కోటేశ్వరరావు కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Related posts

ఆటో డ్రైవర్లకు 16 కండిషన్లు

Satyam News

లోకేష్‌ మార్క్‌ పాలిటిక్స్‌.. జగన్ గజ గజ….

Satyam News

పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు ప్రమాణం

Satyam News

సత్తిబాబు చర్యలతో జగన్ గుండెల్లో గుబులు

Satyam News

వనపర్తిలో లక్షల్లో అద్దె-వేలల్లో టాక్స్

Satyam News

ఏలూరు ఎంపీ డ్రగ్స్ కేసు పై చంద్రబాబు సీరియస్

Satyam News

Leave a Comment