25.2 C
Hyderabad
September 20, 2026
సంపాదకీయంహోమ్

IBM వచ్చేసింది….. విశాఖలో ఆఫీస్ ప్రారంభం

#VizagCity

విశాఖలోని ప్రతిష్టాత్మకమైన లాన్సమ్ స్క్వేర్ బిల్డింగ్‌లో IBM ఆఫీసును ఏర్పాటు చేసింది. ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ iSprout భాగస్వామ్యంతో ఈ ఆఫీస్ కార్యకలాపాలు సాగనున్నాయి. ఈ మేరకు మంత్రి నారా లోకేష్‌ Xలో పోస్టు పెట్టారు. వెల్‌కమ్‌ టు వైజాగ్‌..IBMను స్వాగతించిన లోకేష్. #ChooseSpeedChooseAP అనే హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు.

వైసీపీ హయాంలో ఐటీ కంపెనీలు రాక లేక వెలవెలబోయిన విశాఖకు, ఇప్పుడు IBM రాక కొత్త ఊపిరి పోసింది. IBM వంటి సంస్థ ఒక నగరంలో అడుగుపెట్టిందంటే, దాని అనుబంధ సంస్థలు మరియు ఇతర MNC కంపెనీలు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంటుంది.

సాధారణంగా IBM తన గ్లోబల్ డెలివరీ సెంటర్ల ద్వారా సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, కన్సల్టింగ్ సేవలను అందిస్తుంది. విశాఖ సెంటర్ ద్వారా వందలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఉపాధి దొరకనుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేకుండా,అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ నిర్మించుకునే అవకాశం లభించనుంది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. లోకేష్ స్వయంగా కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతుండటంతో, ఫలితాలు గ్రౌండ్ లెవల్‌లో కనిపిస్తున్నాయి.

Related posts

తన పర్సనల్ అసిస్టెంట్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించిన వినోద్ కుమార్

Satyam News

ఖబడ్దార్ పిన్నెల్లి పిచ్చికూతలు కూస్తే తాటతీస్తాం..!

Satyam News

దేశానికే లీడర్‌..పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానం..!!

Satyam News

పోలీసులకు చిక్కిన అంతర్ రాష్ట్ర ముఠా

Satyam News

కర్నాటకలో సోషల్ మీడియా పై నిషేధం

Satyam News

ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు: 3 వేల మంది టీచర్ల తొలగింపు!

Satyam News

Leave a Comment