26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

యాంకర్ అనసూయపై అసభ్య పోర్టు: ఒకరి అరెస్టు

#AnchorAnasuya

ప్రముఖ సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టు పెట్టిన ఒక యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నల్గొండ జిల్లాకు చెందిన చంటి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ (@chantidhorapally) ద్వారా తనపై అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెట్టినట్లు అనసూయ ఫిర్యాదు చేశారు.

తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, గౌరవానికి భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని అనసూయ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. అనసూయ ఫిర్యాదును స్వీకరించిన సైబరాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని గుర్తించారు. నల్గొండలో ఉన్న చంటిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. సెలబ్రిటీలు తరచుగా ఇలాంటి వేధింపులకు గురవుతున్న నేపథ్యంలో.. అనసూయ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయడంపై సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.

Related posts

దోమల నివారణకు ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్

Satyam News

జల్సాల జగన్ బూట్ల ఖరీదు రూ 2 లక్షలు!

Satyam News

ఏఐలో దేశంలోనే ఏపీ టాప్‌…. లోకేష్‌కి కేంద్ర మంత్రి కితాబు

Satyam News

బీచ్ లో పేలుడు: 11 మంది మృతి

Satyam News

బూతులు.. కిడ్నాపులు.. హత్యలు.. జగన్‌ పరామర్శకు ఇవే అర్హతలా..?

Satyam News

శ్రీవారి పరకామణి చోరీ కేసు: పిటిషనర్ శ్రీనివాసులుకు ప్రాణహాని భయం

Satyam News

Leave a Comment