చిత్తూరుహోమ్

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

#RKRoja

రాజకీయాల్లో చెప్పే మాటలకి, చేసే పనులకి అస్సలు సంబంధం ఉండదని వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా మరోసారి ప్రూవ్ చేశారు. మైక్ ముందు నిలబడితే చాలు..చంద్రబాబుపై, ఆయన ఫ్యామిలీ బిజినెస్ అయిన హెరిటేజ్ మీద విమర్శల బాంబులు కురిపించే రోజా ఇంట్లో అదే హెరిటేజ్ పాల ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆమె వంటింట్లో హెరిటేజ్ పాలు ఉండటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

గతంలో అసెంబ్లీలో గానీ, టీవీ డిబేట్లలో గానీ హెరిటేజ్ సంస్థ మీద రోజా ఎన్ని కామెంట్స్ చేశారో అందరికీ తెలిసిందే. ఆ పాలు తాగితే అది అవుతుంది.. ఇది అవుతుంది అని రేంజ్‌లో ఊగిపోయేవారు. కానీ తీరా చూస్తే, పొద్దున్నే లేవగానే కాఫీలోకో, టీలోకో ఆమెకు హెరిటేజ్ పాలు లేనిదే గడవట్లేదని ఈ వీడియోతో అర్థమైపోయింది. దీంతో  మేడం.. బయట తిట్టేది వేరు, ఇంట్లో తాగేది వేరా? అంటూ జనం సెటైర్లు వేస్తున్నారు.

నిజానికి ఇది ఒక్క రోజా కథే కాదు.. వైసీపీలో చాలా మంది నేతల పరిస్థితి ఇంతే! స్టేజ్ ఎక్కితే హెరిటేజ్ మీద ఏవేవో ఆరోపణలు చేస్తారు కానీ, వాళ్ల ఫ్రిజ్ తీసి చూస్తే మాత్రం అదే హెరిటేజ్ నెయ్యి, పెరుగు, పాలు కనిపిస్తాయి. అంటే రాజకీయం కోసం చంద్రబాబుని తిడతాం కానీ..క్వాలిటీ కోసం మాత్రం ఆయన కంపెనీ పాలే వాడుతాం అన్నట్టుంది వీరి వ్యవహారం. ఇక, ఈ వీడియో మీద సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా లేదు.

మొత్తానికి రోజా తన విమర్శల ద్వారా హెరిటేజ్‌కి నెగటివ్ పబ్లిసిటీ ఇవ్వాలని చూసినా, ఆమె వాడకం చూస్తుంటే మాత్రం ఆ సంస్థకు ఫ్రీగా ప్రమోషన్ ఇచ్చినట్టే అనిపిస్తోంది. రాజకీయం వేరు.. రుచి వేరు అని రోజా ఇలా పాలు విరిచినట్టు తేల్చేశారన్నమాట!

Related posts

లడఖ్ లో మళ్లీ హింస: నలుగురు మృతి

Satyam News

మహనీయుల సరసన రాజకీయం ఏంటి?

Satyam News

తెలంగాణ అగర్వాల్ సమాజ్ కార్యాచరణ ఇదీ…

Satyam News

ఘనంగా లక్ష్మీ నరసింహ స్వామి జయంతి

Satyam News

ట్రంప్ వెళ్లగానే చైనాతో చర్చలకు వెళుతున్న పుతిన్

Satyam News

కత్వ చెరువు రిపేర్లు వెంటనే మొదలు పెట్టాలి

Satyam News

Leave a Comment