30.1 C
Hyderabad
September 27, 2026
తూర్పుగోదావరిహోమ్

కోస్తాలో వైసీపీ ఖాళీ..?? ఆ 5గురు మాజీ ఎమ్‌ఎల్‌ఏలు జంప్‌..??

#Jagan

జగన్‌ను నమ్ముకొంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని వైసీపీ నాయకులకు నెమ్మదిగా క్లారిటీ వస్తోంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. వెంటనే మేల్కొన్న కొంతమంది నేతలు.. అప్పుడే ఫ్యాన్‌ పార్టీని వదిలేశారు. ఈ రెండేళ్లలో జగన్‌ తీరుని గమనించిన తర్వాత.. ఇంకా వైసీపీలో కొనసాగడమంటే.. పొలిటికల్‌గా సూసైడ్‌ చేసుకున్నట్లే అని మిగిలిన వారికీ అర్ధమైపోయింది.

ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలు జనసేనలోకి జంప్‌ చేయబోతున్నారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిలో ముగ్గురు మాజీ మంత్రులు కూడా ఉన్నారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కోస్తాంధ్రలోని ఉమ్మడి 9 జిల్లాల పరిధిలో వైసీపీ నాలుగంటే.. నాలుగే ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొంది. వీటిలోనూ విశాఖపట్నం ఏజెన్సీలో రెండు.. ప్రకాశం జిల్లాలో రెండు స్థానాలు దక్కాయి. అంటే తొమ్మిదిలో ఏడు జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవలేదు.

అధికారం పోయిన తర్వాత గత రెండేళ్లలో ప్రజల్లో వైసీపీకి ఏ మాత్రం ఆదరణ పెరగలేదు సరికదా.. జగన్‌ ఇమేజ్‌ మరింత డ్యామేజ్‌ అయింది. పోనీ రాయలసీమలో బలంగా ఉందనే ప్రచారంలో అయినా నిజం ఉందేమో అనుకొందాం అంటే.. నేను మంచోడిని అంటూ జగన్‌ తనకు తాను ఇచ్చుకున్న సర్టిఫికేట్ అతిపెద్ద సెల్ఫ్‌ గోల్‌గా మారింది.

పులివెందులలోనే కాకుండా కడప జిల్లాలో.. మొత్తం రాయలసీమలో వైఎస్ కుటుంబం చేసిన హత్యా రాజకీయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి, జగన్‌.. ధన దాహానికి, అధికార వ్యామోహానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారితో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వందలాది మంది బలైపోయిన వైనాన్ని కథలు కధలుగా చెప్పుకొంటున్నారు.

గెలుక్కొని మరీ గతాన్ని తవ్వుకోవడంతో.. రాయలసీమలోనూ జగన్‌ మీద విపరీతమైన వ్యతిరేకత కనిపిస్తోంది. రాజకీయంగా ఎదగడానికి అడ్డొచ్చిన వాళ్లందరినీ హత్యలు చేసుకొంటూ పోయిన రాక్షసులకు నెత్తినెక్కించుకొంటే.. మరోసారి రక్త చరిత్ర రిపీట్‌ అవుతుందనే భయాందోళనలు సీమ ప్రజల్లో కనిపిస్తున్నాయి.

మరోవైపు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌.. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వైసీపీకి టాటా చెప్పాలనుకొనే నేతలు జనసేనలోకి జంప్‌ చేయడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts

ముంబై కోల్‌కతా నగరాలకు ముంపు ప్రమాదం?

Satyam News

తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ అభినందన

Satyam News

ఉత్త‌రాంధ్ర చ‌రిత్ర పుట‌ల్లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించే రోజు

Satyam News

ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిడమర్రు మోడల్ స్కూల్

Satyam News

కవాడీగూడాలో మహిళ దారుణ హత్య

Satyam News

యూరియా ఎక్కువ వాడితే నేల విషతుల్యం

Satyam News

Leave a Comment