సంపాదకీయంహోమ్

లిక్కర్ స్కామ్‌: నోటు ముక్క ఫొటోతో దొరికిపోయిన కారుమూరి.!

#KarumuriSunilkumar

ఏపీలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. APSBCL డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన భారీ అవినీతిపై ఈడీ స్పెషల్‌ ఫోకస్ పెట్టింది.

ఈ కేసులో ఇప్పటికే APSBCL మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, వైసీపీ హయాంలో చక్రం తిప్పిన రాజ్‌ కెసిరెడ్డితోపాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌ కుమార్‌లను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో దొరికిన ఒకే ఒక్క హవాలా నంబర్, దానికి సంబంధించిన ఆధారాలు టాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.

నిందితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ED అధికారులకు ఊహించని ఆధారం చిక్కింది. కారుమూరి సునీల్‌ కుమార్‌ ఫోన్‌ను స్కానింగ్ చేయగా, అందులో ఓ కరెన్సీ నోటు ముక్క ఫొటో కనిపించింది. హవాలా మార్కెట్‌లో అత్యంత రహస్యంగా లావాదేవీలు జరపడానికి ఇలాంటి నోటు ముక్కలను టోకెన్లుగా వాడుతుంటారు.

ఓ నగరంలో ఏజెంట్‌కు నల్లధనం అప్పగించినప్పుడు వారు ఇచ్చే సగం నోటు ముక్క ఫొటోను మరో నగరంలోని వ్యక్తికి పంపిస్తారు. అక్కడ ఆ ఫొటోను చూపించి క్యాష్ కలెక్ట్ చేసుకుంటారు. ఈ చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన తిరుగులేని సాక్ష్యం ఇప్పుడు ED చేతికి దొరకడంతో నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.195 కోట్ల విలువైన మద్యం సరఫరా కాంట్రాక్టును సిగ్మా సప్లై చైన్‌ సొల్యూషన్స్‌, ప్రసాద్‌ ట్రాన్స్‌పోర్టు సంస్థలకు కట్టబెట్టారు. ఈ సిగ్మా సంస్థ నుంచి వల్లు సందీప్‌కు చెందిన సుదర్శన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ సబ్‌ కాంట్రాక్టు తీసుకుంది. ఈ రూట్ లోనే సిగ్మా నుంచి సుదర్శన్‌ కంపెనీకి, అక్కడ నుంచి సునీల్‌కుమార్‌ ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు చేరాయి. ఈ అక్రమ సొమ్మును సునీల్‌కుమార్‌ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడబెట్టడమే కాకుండా, గత ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేసినట్లు ED బలంగా అనుమానిస్తోంది.

ఇప్పటివరకు కేవలం కాగితాలకే పరిమితమైన ఈ రూ.195 కోట్ల కుంభకోణానికి ఈ నోటు ముక్క ఫొటోతో బలమైన లింక్ దొరికినట్లయింది. ఈ స్కామ్ లోని సింహభాగం డబ్బు ఎటు మళ్లిందనేది ఈ ఒక్క ఆధారంతో తేలిపోనుంది. ఈ నోటు ముక్క ఫొటోను ఎవరికి పంపారనే కోణంలో నిందితులను ED అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మంగళవారం ED అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. ఈ విచారణ ముగిస్తే పెద్దల గుట్టు రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Related posts

ఇంద్రకీలాద్రిపై 6 నుంచి కుంభాభిషేకం

Satyam News

ఉద్య‌మాల నిప్పుక‌ణిక స‌ర్ధార్ గౌతు ల‌చ్చ‌న్న‌

Satyam News

అమరావతిపై వైసీపీ ఫేక్ నెరేటివ్స్…అసలు నిజాలివి.!

Satyam News

దేశంలో తగ్గుముఖం పట్టిన పేదరికం

Satyam News

ఇక నుంచి రెగ్యులర్గా వస్తా.ఊరికి చేసేది చాలా ఉంది

Satyam News

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

Leave a Comment