కర్నూలుహోమ్

జగన్ చేసిన తప్పులే ప్రజలకు శాపాలు

#ChandrababuNaidu

నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఆయన, గత రెండేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన తప్పిదాలు ప్రజలకు శాపంగా మారాయని, లక్షలాది కుటుంబాలు వారి అరాచకాలకు బలయ్యాయని విమర్శించారు.

గత పాలకులు తమకు నచ్చని వ్యక్తులను ఇబ్బందులకు గురిచేసేందుకు వారి భూములను 22ఏ జాబితాలో చేర్చి భూ వివాదాలు సృష్టించారని, ప్రజల భూములను లాక్కునేందుకు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. భూ హక్కులను హరించేలా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల్లో భయాందోళనలు కల్పించారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామని ఇచ్చిన హామీ మేరకు దానిని రద్దు చేశామని గుర్తుచేశారు.

రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు. గతంలో భూమి పత్రాలపై, సర్వే రాళ్లపై కూడా నాయకుల చిత్రాలు ముద్రించారని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నామని చెప్పారు. కట్టుదిట్టమైన భద్రతా లక్షణాలతో తప్పులు లేకుండా రైతులు, భూ యజమానులకు ఈ పాస్ పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. దీనిని ఒక ఉద్యమంలా, పవిత్రమైన కార్యక్రమంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

2027 మార్చి నాటికి రాష్ట్రంలోని 9,833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

విలేజ్ ఇనామ్ భూములను కూడా గత ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చిందని, అయితే 1,971 గ్రామాల్లో రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రక్రియను పూర్తి చేసి సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఆటో మ్యుటేషన్ విధానం ద్వారా వారసత్వ ఆస్తులు సంబంధిత వారసులకు సులభంగా బదిలీ అయ్యేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుందిలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాలను పరిష్కరించినట్లు వెల్లడించారు.

డోన్ నియోజకవర్గంలోని 2,074 ఎకరాల వక్ఫ్ భూములను కూడా గత ప్రభుత్వం 22ఏ జాబితాలో చేర్చిందని, వాటిని తొలగించి రైతుల సమస్యలను పరిష్కరించామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరిస్తూనే అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

రాయలసీమ రూపురేఖలను మార్చే దిశగా భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు అమలవుతున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. కడపలో ఉక్కు కర్మాగారం, హీరో మోటార్స్ పరిశ్రమ, అమ్కా రక్షణ యుద్ధ విమానాల తయారీ కర్మాగారం ఏర్పాటవుతున్నాయని చెప్పారు. రాయలసీమలో తయారయ్యే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిళ్లు దేశవ్యాప్తంగా ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు, ప్రైవేటు రంగంలో రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో రాయలసీమను ఉద్యానవన పంటల కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

కడప జిల్లా లింగాల వంటి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల కంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లాలో కూడా ఉద్యానవన పంటల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

ఎల్ నినో ప్రభావంతో ఈ సీజన్‌లో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణంతో పోలిస్తే 22 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఆయన వెల్లడించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా “జలధార” కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. నంద్యాల జిల్లాలో 18 కిలోమీటర్ల ఫీడర్ కాలువలు, చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మళ్లించగలిగితేనే రాష్ట్రానికి శాశ్వత నీటి భద్రత సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Related posts

కపిల్ శర్మ కేఫ్‌పై మూడోసారి కాల్పులు

Satyam News

స్పోర్ట్స్ పట్టుదలతో ఆడాలి

Satyam News

రాహుల్ గాంధీకి షాక్: పౌరసత్వంపై విచారణ

Satyam News

సహజనటి జయసుధ “లక్ష్మణరేఖ” కు 50 సంవత్సరాలు

Satyam News

తెలంగాణ అమరుల త్యాగం మరువలేనిది

Satyam News

మరో 3 రోజులు భారీ వర్షాలు

Satyam News

Leave a Comment