కరీంనగర్హోమ్

కాంగ్రెస్ గెలిస్తే ప్రజలు గెలిచినట్లే

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శనివారం విస్తృతంగా పర్యటించారు.

వేములవాడలోని పలు వార్డుల్లో పర్యటించిన మంత్రులు, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ముమ్మరంగా సాగిన ఎన్నికల ప్రచారంవేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అభ్యర్థి సాగరం వెంకటస్వామి, 10వ వార్డు అభ్యర్థి సిరిగిరి సంగీత, 9వ వార్డు అభ్యర్థి నీలం మమత, 23వ వార్డు అభ్యర్థి నామాల ఉమ, మరియు 22వ వార్డు అభ్యర్థి ఇప్పుపూల మమతలకు మద్దతుగా మంత్రులు రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే వేములవాడ మరింత అభివృద్ధి చెందుతుందని వారు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ విప్ ఆది శ్రీనివాస్ ప్రజా పక్షపాతి అని కొనియాడారు. “న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎన్నికైన నాయకుడు ఆది శ్రీనివాస్. ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ఒక ఎత్తైతే, ఆయన అనుచరులను కౌన్సిలర్లుగా గెలిపించుకోవడం మరో ఎత్తు. కౌన్సిలర్లు గెలిచినప్పుడే ముఖ్యమంత్రి నుంచి నిధులు తీసుకురావడానికి ఆది శ్రీనివాస్‌కు బలం చేకూరుతుంది,” అని పేర్కొన్నారు.

ఆది శ్రీనివాస్ అడిగితే ప్రభుత్వం ఏ పనైనా చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు.దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ రాజన్న క్షేత్రాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చి యార్న్ డిపోను ప్రారంభించారని, చేనేత కార్మికుల కోసం రూ. 1,100 కోట్లు మంజూరు చేశారని గుర్తుచేశారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మంత్రి తుమ్మల ఈ సందర్భంగా ప్రజలకు వివరించారు.

రైతులకు రూ. 21 వేల కోట్ల రుణమాఫీ పూర్తి చేశాం.

చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్. కోటి మంది మహిళలకు ఇచ్చే చీరల తయారీ బాధ్యతను సిరిసిల్ల చేనేత కార్మికులకే అప్పగించాం.

దాదాపు రూ. 900 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ, ఆర్టీసీకి రూ. 9,600 కోట్లు చెల్లించాం. దీనివల్ల మహిళలకు రూ. 9,690 కోట్లు ఆదా అయ్యాయి.

200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం.

ప్రజల కష్టసుఖాల్లో తోడుండే ఆది శ్రీనివాస్ చేతులను బలోపేతం చేసేందుకు, వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.

Related posts

సోషల్ మీడియాపై నిషేధం: ఒక సంచలనం

Satyam News

ఏపీలో ఈ హాస్పిటల్… దేశంలో ఎక్కడున్నా వైద్యం

Satyam News

ఏపీ లిక్కర్ గ్యాంగ్ తో విజయ్ చెట్టాపట్టాల్.!

Satyam News

భార్య పిల్లల్ని చితక్కొట్టినా తప్పులేదు

Satyam News

మే 15 లోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి

Satyam News

ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్‌ క్లస్టర్‌…

Satyam News

Leave a Comment