30.3 C
Hyderabad
September 23, 2026
కృష్ణహోమ్

రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు అక్టోబర్ 2న శంకుస్థాపన

#CBN

రాయలసీమ దశ దిశ మార్చే హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించనుంది. మదనపల్లెలో అక్టోబర్ 2వ తేదీన కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభిచనున్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ పథకం కింద రాయలసీమ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వివిధ రూపాల్లో ఇవ్వనుంది.

వీటికి తోడు మరో రూ.60 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడుల ద్వారా రానున్నాయి. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర కృషితో, కేంద్రంతో సమన్వయంతో ఈ ప్రాజెక్టును సాధించారు. దీని ద్వారా కరువు పీడిత ప్రాంతాల్లో హార్టికల్చర్ రంగానికి ఊతం ఇచ్చే కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందిస్తున్న  ప్రభుత్వం…మరోవైపు హార్టికల్చర్‌ను ప్రోత్సహించడం ద్వారా ఆ ప్రాంతాల్లో సంపద పెరిగేందుకు, రైతులు లబ్ది పొందేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. మదనపల్లెలో జరిగే ఈ కార్యక్రమంతో పాటు ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు కూడా శంకుస్థాపన చేయనున్నారు. వ్యవసాయం రంగంలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు అయ్యే ఈ అగ్రికల్చర్ స్కూల్‌ను రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోంది.

సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలు

ఈ నెల 29వతేదీ నుంచి 5 రోజుల పాటు సీఎం చంద్రబాబు వరుస కార్యక్రమాలు, పర్యటనల్లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 29వ తేదీన విజయవాడలో ఉదయం DOPT కర్మయోగి మిషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగే పల్లె పండుగ కార్యక్రమానికి హాజరవుతారు. 30వ తేదీ విజయవాడలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొంటరు.

24 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నారు. అక్టోబర్ 1వ తేదీ ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు పంపిణీ చేస్తారు. 2వ తేదీ మదనపల్లెలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన తరువాత స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు. 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే వార్షిక స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం విజయవాడలో పాల్గొంటారు. 3వ తేదీ విజయవాడలో పాన్ ఐఐటీ సదస్సులో సీఎం పాల్గొంటారు.

Related posts

ధర్మేంద్ర కేవలం భర్త మాత్రమే కాదు….

Satyam News

పెద్దకుమార్తె పిలుస్తోందని ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

Satyam News

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..??

Satyam News

రష్యాకు విమాన భాగాలు అమ్మిన వ్యక్తికి శిక్ష

Satyam News

చంద్రబాబు..  ది టార్చ్‌బేరర్‌.. నాడు మైక్రోసాఫ్ట్‌…నేడు గూగుల్‌!

Satyam News

ధనవంతుడైన మామ హత్యకు కోడలు కుట్ర?

Satyam News

Leave a Comment