31.6 C
Hyderabad
September 21, 2026
అనంతపురంహోమ్

భగవాన్ సత్యసాయి సన్నిధిలో ప్రధాని మోడీ

#Modi

భగవాన్ సత్యసాయి భౌతికంగా మనతో లేకున్నా ఆయన ప్రేమ మనతోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన నేడు పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తికి రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సత్యసాయి స్మారక నాణం విడుదల చేశారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.

సత్యసాయి బాబా బోధనలు ఎంతోమందికి మార్గం చూపాయని కొనియాడారు. ప్రేమ, శాంతితో కూడిన వసుదైక కుటుంబ భావన సత్యసాయిదని తెలిపారు. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనకు చాటి చెప్పారని అన్నారు. మానవ జీవితంలో సేవ చాలా ముఖ్యమని సత్యసాయి చెప్పారని గుర్తుచేశారు.

అందరినీ ప్రేమించాలి.. అందరికీ సేవ చేయాలి.. ఇదే బాబా నినాదమని వివరించారు. గుజరాత్ భూకంపం వచ్చినప్పుడు బాబా సేవాదళ్ సేవలందించిందని గుర్తుచేశారు. పేదలకు ఎప్పుడు ఆపద వచ్చినా.. బాబా సేవాదళ్ ఆదుకుంటుందని ప్రశంసించారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారనిపేర్కొన్నారు.

Related posts

పాడి రైతులకు క్రెడిట్‌ కార్డులు‌….. ఏపీ ప్రభుత్వం కొత్త స్కీమ్‌

Satyam News

బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్

Satyam News

ఒక్కటైన రష్మిక మందన విజయ్ దేవరకొండ

Satyam News

అమరావతిపై వైసీపీ ఫేక్ నెరేటివ్స్…అసలు నిజాలివి.!

Satyam News

నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్

Satyam News

గద్వాల పట్టణంలో సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి

Satyam News

Leave a Comment