24.4 C
Hyderabad
September 21, 2026
విశాఖపట్నంహోమ్

విశాఖకు ఏఐ పవర్.. గ్లోబల్‌ ఐటీ మ్యాప్‌లో ఏపీ

#Google

గ్లోబల్ ఐటీ మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకస్థానంలో నిలపాలన్న లక్ష్యం దిశగా మరో అడుగు వేసింది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నంను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చడమే లక్ష్యంగా చేపట్టిన AI డేటా సెంటర్ ప్రాజెక్టును మరింత విస్తరించింది. గతంలో అనుకున్న 480 ఎకరాలను కాస్తా, ఇప్పుడు ఏకంగా 601.4 ఎకరాలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసి, రైతులకు పరిహారం కూడా పంపిణీ చేయడంతో ఈ మెగా ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టనున్నాయి.

ఈ ప్రాజెక్టు కోసం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని మూడు వ్యూహాత్మక ప్రాంతాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. తర్లువాడలో అత్యధికంగా 266.6 ఎకరాలు, అడవివరం-ముడసర్లోవ పరిధిలో 160 ఎకరాలు, రాంబిల్లి (అనకాపల్లి) ప్రాంతంలో 174.8 ఎకరాలు కేటాయించారు. ఈ భూములను రైడెన్ ఇన్ఫోటెక్ భాగస్వామ్య సంస్థ అయిన అదానీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటాకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలని బాబు సర్కార్ నిర్ణయించింది. మొన్నటి AI సమ్మిట్‌లో గూగుల్ CEO సుందర్ పిచాయ్ కూడా ఏపీలో ఉన్న అవకాశాలను ప్రశంసించారు. ఈ డేటా సెంటర్ కేవలం డేటా దాచుకోవడానికే కాకుండా, ప్రపంచ స్థాయి టెక్ కంపెనీలకు సర్వీస్ హబ్‌గా మారబోతోంది.

ఈ ప్రాజెక్ట్ విస్తరణతో కేవలం ఐటీ కంపెనీలే కాదు, వేల సంఖ్యలో ఉద్యోగాల రానున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ రంగాల్లో నిపుణులైన స్థానిక యువతకు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక విప్లవంతో పాటు సాంకేతిక విప్లవం కూడా తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పం ఈ ప్రాజెక్టుతో నెరవేరబోతోందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

డ్రగ్స్ టెస్టుకు మేం సిద్ధం…మీరు సిద్ధమా?

Satyam News

భారత్ రష్యా బంధం మరింత ధృఢంగా ముందుకు…

Satyam News

ఎంపీడీఓలకు వాహనాలు అత్యవసరం: అధ్యక్షురాలు జొన్నల పద్మావతి

Satyam News

ఆ కంపెనీని తరిమేస్తా….. నెల్లూరులో జగన్‌ రప్పా రప్పా..!!

Satyam News

యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదు

Satyam News

పశ్చిమ బెంగాల్ లో చీలిపోయిన మమతా బెనర్జీ పార్టీ

Satyam News

Leave a Comment