26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

ప్రియురాలి మోజులోనే ఎల్ మెన్చో హతం

#Mexico2

ప్రియురాలి కోసం వెళ్లడం వల్లే మెక్సికో డ్రగ్స్ కింగ్ “ఎల్ మెన్చో” హతుడయ్యాడని తాజాగా వెల్లడి అయింది. “ఎల్ మెన్చో” తో ప్రేమ సంబంధం ఉన్న మహిళపై నిఘా పెట్టడం ద్వారా మెక్సికో సాయుధ దళాలు అతడిని మట్టుపెట్టాయి. జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) నాయకుడైన ఎల్ మెన్చో ఆదివారం జరిగిన ప్రత్యేక ఆపరేషన్‌లో పట్టుబడి, అనంతరం మృతిచెందిన విషయం తెలిసిందే.

అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో మెక్సికో ఆర్మీ నిర్వహించిన ప్రత్యేక దళాల ఆపరేషన్ జాలిస్కో రాష్ట్రంలోని అతని స్వగ్రామ ప్రాంతంలో జరిగింది. అడవిలో పొదల్లో దాగి ఉన్న ఎల్ మెన్చోను ప్రత్యేక దళాలు గుర్తించాయి. జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది గన్‌మెన్‌లు మృతి చెందగా, ఎల్ మెన్చో మరియు అతని ఇద్దరు బాడీగార్డులు గాయపడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

ఇప్పటికి మొత్తం 70 మంది మృతి

ఈ ఆపరేషన్, తదనంతర హింసలో భద్రతా సిబ్బంది, అనుమానిత కార్టెల్ సభ్యులు సహా మొత్తం 70 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఎల్ మెన్చోను పట్టుకునేందుకు మెక్సికో, అమెరికా దేశాలు ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాయి. అతనిపై రెండు దేశాల్లోనూ సంఘటిత నేరాలు, డ్రగ్ రవాణా కేసుల్లో అనేక అరెస్ట్ వారెంట్లు ఉన్నాయి.

అతని ప్రేమికుల్లో ఒకరికి సన్నిహిత వ్యక్తిని సైనిక దర్యాప్తు బృందాలు గమనించాయి. ఆ వ్యక్తి ఆ మహిళను జాలిస్కో రాష్ట్రంలోని తపల్పా ప్రాంతానికి తీసుకెళ్లినట్లు గుర్తించారు. అమెరికా ఇంటెలిజెన్స్ అందించిన కీలక సమాచారం ఆధారంగా ఖచ్చితమైన స్థలాన్ని నిర్ధారించారు.

ఆదివారం తెల్లవారుజామున మెక్సికో సైన్యం, నేషనల్ గార్డ్ సంయుక్తంగా భూభాగాన్ని చుట్టుముట్టి ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ సమయంలో మెక్సికో అధ్యక్షురాలకు ప్రతి పరిణామం గురించి సమాచారం అందించినట్లు తెలిపారు. కాల్పుల సమయంలో ఎల్ మెన్చో ఇద్దరు బాడీగార్డులతో పారిపోవడానికి ప్రయత్నించగా, మిగతా గన్‌మెన్‌లు సైన్యాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు.

సంఘటనా స్థలంలో ఎనిమిది మంది మృతి చెందారు. సీజ్ చేసిన ఆయుధాలలో రెండు రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. వీటిలో ఒకటి 2015లో CJNG సైనిక హెలికాప్టర్‌ను కూల్చివేసిన మోడల్‌తో సమానమని అధికారులు తెలిపారు. కాల్పుల సమయంలో ఒక సైనిక హెలికాప్టర్‌పై కాల్పులు జరగడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ముగ్గురు సైనికులు గాయపడ్డారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఆసుపత్రికి తీసుకెళ్లే లోపునే మృతి

గాయపడిన ఎల్ మెన్చోను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా, అతను తీవ్ర స్థితిలో ఉండటంతో మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు రికార్డో ట్రెవిల్లా తెలిపారు. హింసాత్మక ప్రతీకార చర్యలను నివారించేందుకు మృతదేహాలను జాలిస్కో రాజధానికి కాకుండా మెక్సికో సిటీకి తరలించారు.

ఇక “ఎల్ తులీ”గా పిలువబడే లాజిస్టిక్స్ నిర్వాహకుడు ప్రతి సైనికుడిని చంపితే 20,000 పెసోలు (సుమారు 1,000 డాలర్లు) బహుమతి ఇస్తామని ప్రకటించినట్లు తెలిపారు. అతడిని కూడా అనంతరం జరిగిన కాల్పుల్లో హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు. జాలిస్కోలో 25 నేషనల్ గార్డ్ సభ్యులు, ఒక జైలు అధికారి, ఒక ప్రాసిక్యూటర్ కార్యాలయ సిబ్బంది, ఒక మహిళ సహా పలువురు మరణించగా, పొరుగు రాష్ట్రం లో నలుగురు గన్‌మెన్‌లు హతమయ్యారు, 15 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో మెక్సికోలో డ్రగ్ కార్టెల్‌లపై పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది.

Related posts

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

Satyam News

మహనీయుల సరసన రాజకీయం ఏంటి?

Satyam News

బీచ్ లో పేలుడు: 11 మంది మృతి

Satyam News

దాససాహిత్య గాయకులకు టీటీడీ నుంచి సువర్ణావకాశం

Satyam News

పీ ఓ కే లో ఉగ్రరూపం దాల్చిన నిరసనలు

Satyam News

అయతొల్లా అలీ ఖమేనీ ని చంపేసిన అమెరికా

Satyam News

Leave a Comment